Hatsun Agro: మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా చిన్నమెుత్తంలో డబ్బు దాచుకునేవారే ఉంటారు కాబట్టి. తాజాగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన ఒక స్టాక్ రాకెట్ లాగా పెరుగుతోంది.

పెట్టుబడి వివరాలు:
SBI మ్యూచువల్ ఫండ్ తాజాగా Hatsun Agro Products Ltd కంపెనీలో కొత్తగా వాటాలను కొనుగోలు చేసింది. ఓపెన్ మార్కెట్ నుంచి కంపెనీకి చెందిన 15,20,000 షేర్లను ఎస్బీఐ హస్తగతం చేసుకుంది. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్ హౌస్ ఒక్కో షేరుకు రూ.987.80 చెల్లించింది.

రూ.150 కోట్లు పెట్టుబడి:
మ్యూచువల్ ఫండ్ సంస్థ ఈ అగ్రి స్టాక్‌లో దాదాపు రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇదే క్రమంలో సుందరం మ్యూచువల్ ఫండ్ కంపెనీలో సుమారు రూ.118 కోట్ల పెట్టుబడి పెట్టి 12 లక్షల షేర్లను కొనుగోలు చేసింది.

స్టాక్‌పై ప్రభావం:
హట్సన్ ఆగ్రో కంపెనీలో షేర్ల కొనుగోలు వార్తల తర్వాత.. షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. గత నాలుగు రోజుల్లో ఈ అగ్రి స్టాక్ ఒక్కో షేరు రూ.988 స్థాయి నుంచి రూ.1117 స్థాయికి పెరిగింది. అంటే నాలుగు రోజుల్లో దాదాపు 13 శాతం లేదా రూ.129 పెరుగుదల నమోదైంది.

SBI మ్యూచువల్ ఫండ్ ఏమంటోందంటే:
హట్సన్ కంపెనీలో 15.2 లక్షల కొత్త షేర్లను కొనుగోలు చేసినట్లు SBI తెలిపింది. ఈ కొనుగోలుకు ముందు.. 10,591,562 షేర్లు కలిగి ఉంది. అలా అప్పట్లో కంపెనీలో 4.9134 శాతంగా ఉన్న వాటాలు మరో 0.70 శాతం పెరిగినట్లు ప్రకటించింది.

సుందరం మ్యూచువల్ ఫండ్:
SBI మ్యూచువల్ ఫండ్‌తో పాటు.. సుందరం మ్యూచువల్ ఫండ్ కూడా హట్సన్ కంపెనీకి చెందిన 12 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. ఇలా కంపెనీలో రూ.118 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.

కంపెనీ వ్యాపారం:
Hatsun Agro కంపెనీ.. పాలు, పాల ఉత్పత్తులు, ఐస్ క్రీం ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ వ్యాపారాల్లో ఉంది. కంపెనీ విభాగాల్లో పాలు, పాల ఉత్పత్తులతో పాటు ప్రధానంగా పశువుల మేత, రెడీ టూ ఈట్ ఉత్పత్తులు ఉన్నాయి. కంపెనీ అరుణ్ ఐస్‌క్రీమ్స్, ఆరోక్య, హట్సన్, HAP డైలీ, Ibaco, Santosa, Oyalo బ్రాండ్స్ పేర్లపై తన ఉత్పత్తుల అమ్మకాలను జరుపుతోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications