Pension for unmarried: పెళ్లికాని ప్రసాదులకు గుడ్ న్యూస్.. ఇకపై అవివాహితులకూ అక్కడ పెన్షన్
Pension for unmarried: వయసు మీద పడుతున్నా పెళ్లి కావడం లేదని బాధపడేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్లు, వితంతువులు మాదిరిగానే పెళ్లికాని ప్రసాదులకూ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి అర్హత వయస్సును సైతం ప్రకటించిడం విశేషం.
పెళ్లికాని వారికి పెన్షన్ ఇచ్చేందుకు హర్యానా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. 45 నుంచి 60 ఏళ్ల అవివాహితులు దీనికి అర్హులని చెప్పారు. నెల రోజుల్లో ఈ పథకం గురించి పూర్తి వివరాలు చెబుతామన్నారు. కర్నాల్ జిల్లా కమల్ పురా గ్రామంలో జరిగిన జన్ సంవాద్ కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు.

ఈ ప్రతిపాదిత పథకం ద్వారా దాదాపు 2 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సంఖ్య ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. హర్యానా ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులు, మరుగుజ్జులు, ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్‌లను అందజేస్తోంది. కాగా ఈ లిస్టులోకి ఇక అవివాహితులు సైతం చేరనున్నారు.
ఇదేకాక వృద్ధాప్య పింఛనును 250 పెంచుతున్నట్లు CM తెలిపారు. తద్వారా ఇకపై నెలకు 3 వేలు చొప్పున సీనియర్ సిటిజన్లు పెన్షన్ పొందనున్నారు. 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. దీనికితోడు రాష్ట్రంలో 917గా ఉన్న లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి ప్రతిపాదిత పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications