Harshad Mehta:శత్రువుకు కూడా మా పరిస్థితి రావద్దు..నోరు విప్పిన హర్షద్ మెహతా భార్య..షాకింగ్ విషయాలు వెలుగులోకి

Harshad Shantilal Mehta: హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ల ప్రపంచంలో ఒక సంచలన వ్యక్తి. ఆయనే ఆ సామ్రాజ్యానికి బిగ్ బుల్. పెట్టుబడి పెట్టాలనుకున్న ప్రతిఒక్కరికీ ఆయనే ది రోల్ మోడల్. ఇదందా 30 ఏళ్ల క్రితం మాట. 1992లో ఆయన చేసిన ఆర్థిక మోసం వెలుగులోకి రావటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

2001 డిసెంబర్ లో హర్షద్ మెహతా మరణించిన 20 ఏళ్ల తర్వాత ఆయన భార్య నోరు విప్పారు. ప్రపంచానికి తెలియని అనేక విషయాలను harshadmehta.in వెబ్ సైట్ ద్వారా బహిర్గతం చేస్తున్నారు. హర్షద్ మెహతా జైలులో అనుభవించిన వేధింపులను, గుండెపోటు వచ్చినప్పుడు కూడా వైద్య సహాయం లేకపోవడం గురించి అనేక సంచలన విషయాలను జ్యోతి వెల్లడించారు.

 హర్షద్ మెహతా..

హర్షద్ మెహతా..

దాదాపు 20 ఏళ్ల క్రితం హర్షద్ మెహతా పేరు మీడియాలో కథనాల్లో సంచలనంగా మారింది. హర్షద్ మెహతా ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. అతని సోదరుడు హర్షద్ మెహతాతో కలిసి గ్రోమోర్ అనే బ్రోకరేజ్ సంస్థను స్థాపించి 1987లో స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. స్టాక్ మార్కెట్ లో లొసుగులను వినియోగించి కోట్లకు పడగలెత్తినట్లు 1992లో వెలుగులోకి వచ్చింది. షేర్ల కొనుగోలుకు బ్యాంకులోని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు తేలటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

 బిగ్ బుల్ పతనం..

బిగ్ బుల్ పతనం..

హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుదిపేసింది. ఈ వార్తకు SCAM అనే హెడ్ లైన్ తొలిసారిగా వార్తా పత్రికల్లో హెడ్డింగ్ గా మారింది. దీని తరువాత కొత్తగా అనేక కఠిన చట్టాలను దేశంలో తీసుకురావటం జరిగింది. స్టాక్ మార్కెట్లో మెహతా ఎంత ఎత్తుకు ఎదిగారో అదే విదంగా పాతాళానికి చేరుకున్నారు.

జైలులో మరణం..

జైలులో మరణం..

2001లో హర్షద్ మెహతా జైలులో గుండెపోటుతో మరణించినప్పుడు అసలు జరిగిన నిర్లక్ష్యం గురించి, జైలు అధికారులు స్పందన గురించి అనేక వాస్తవాలను harshadmehta.inలో జ్యోతి పొందుపరిచారు. ఆయనది సాధారణ మరణం కాదని, వైద్యం అందించటంలో జరిగిన అలసత్వమేనని ఆమె చెప్పారు. 47 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉన్న మెహతా చివరికి డిసెంబర్ 30, 2001న జైలులో అకస్మాత్తుగా మరణించారు. అయితే అంకుముందు మెహతాకు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని భార్య జ్యోతి పేర్కొంది.

జైలు అధికారుల నిర్లక్ష్యం ఇలా..

జైలు అధికారుల నిర్లక్ష్యం ఇలా..

హర్షద్ మెహతాకు గుండెపోటు వచ్చిన మొదటి 4 గంటలు క్రిటికల్‌గా ఉన్నట్టు జైలు గార్డులకు తెలిసినా, ఆ నాలుగు గంటల్లో జైలు అధికారులు ఆయనకు చికిత్స చేసేందుకు ముందుకు రాలేదని, జైలు అధికారులు తనకు సమాచారం కూడా ఇవ్వలేదని జ్యోతి తన వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఆ సమయంలో తన గుండెపోటు గురించి మెహతా పక్క సెల్‌లో ఉన్న సోదరుడికి సమాచారం అందించారని పేర్కొన్నారు. జైలు వైద్యులు పరీక్షించినప్పుడు గుండెపోటు మాత్రలు లేవనడంతో.. హర్షద్ మెహతా తన మెడికల్ బాక్స్‌లో మందు అడిగి తెలుసుకున్నారు. ఆ మందు నాలుగు గంటలపాటు మెహతాను బతికించిందని జ్యోతి తెలిపారు.

దర్యాప్తు నివేదిక వాస్తవాలు..

దర్యాప్తు నివేదిక వాస్తవాలు..

గంటల పాటు ఆలస్యం తర్వాత జైలు అధికారులు మెహతాను ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఆపై తనకు రెండవసారి గుండెపోటు వచ్చి వీల్ చైర్‌లోనే చనిపోయారని జ్యోతి వెల్లడించారు. తన భర్త మరణానికి సంబంధించి అధికారులు ఎలాంటి విచారణ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక ఇవ్వలేదని.. దీనికోసం జైలు అధికారులను ఎన్నిసార్లు కోరినప్పటికీ స్పందన లేదని చెప్పారు.

వైద్యుని ద్వారా నిజాలు..

వైద్యుని ద్వారా నిజాలు..

భర్త చనిపోతున్న ఆఖరి క్షణంలో అతడికి అండగా నిలవలేకపోతున్నామని, వైద్యుడి ద్వారా ఎన్నో నిజాలు తెలుసుకున్నామని, మా పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదని కోరుతున్నట్లు జ్యోతి వెబ్ సైట్ లో నమోదు చేశారు. జ్యోతి మెహతా పెట్టిన ఈ పోస్ట్ భారీ స్థాయిలో వైరల్ అవుతుండడం గమనార్హం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+