Harsha Engineers IPO: హర్ష ఇంజినీరింగ్స్ రూ.570 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం..!
పబ్లిక్ ఆఫర్ చివరి రోజున హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ IPO 74.70 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు (QIB) IPOలో అత్యధిక బిడ్డింగ్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా IPO కోసం పోటీ పడ్డారు. ఆదివారం, గ్రే మార్కెట్‌లో, IPO రూ.240 వద్ద ట్రేడవుతోంది. గ్రే మార్కెట్‌లో హర్ష ఇంజనీర్స్ IPO ప్రస్తుతం ఒక్కో ఈక్విటీ షేర్‌కి ₹240 GMPని కలిగి ఉంది.

రూ.240 GMP
గ్రే మార్కెట్ అంటే కంపెనీ షేర్లు వ్యాపారులకు అనధికారికంగా అందిస్తారు. ఒక్కో షేరుకు రూ.240 GMPతో, హర్ష ఇంజనీర్స్ ఒక్కో షేరుకు ₹570 ప్రీమియంతో లిస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు అంచా వేస్తున్నారు. సెప్టెంబరు 21న జరిగే ఐపీఓలో అర్హులైన బిడ్డర్లకు హర్ష ఇంజనీర్స్ షేర్లను కేటాయిస్తుంది. కంపెనీ సెప్టెంబరు 26, 2022న మార్కెట్‌లో లిస్ట్ అవుతుంది. ఇది NSE, BSE రెండింటిలోనూ లిస్ట్ కానుంది

ఓవర్‌సబ్‌స్క్రైబ్
హర్ష ఇంజనీర్స్ ₹755 కోట్లను సమీకరించడం కోసం తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది. 3వ రోజు, IPO 74.70 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. QIBల కోసం రిజర్వ్ చేసిన భాగం 178.26 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయింది. NII కేటగిరీ 71.32 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ చేయబడిన భాగం 17.63 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయబడింది.

బేరింగ్ కేజ్‌ల తయారీలో అగ్రగామి
హర్ష ఇంజనీర్స్ భారతదేశంలోని వ్యవస్థీకృత రంగంలో ఆదాయ పరంగా ఖచ్చితమైన బేరింగ్ కేజ్‌ల తయారీలో అతిపెద్దదిగా ఉంది. ప్రపంచంలోని ప్రెసిషన్ బేరింగ్ కేజ్‌ల తయారీలో అగ్రగామిగా ఉంది. ఇది CY 2021లో భారతీయ బేరింగ్ కేజ్‌ల మార్కెట్‌లోని వ్యవస్థీకృత విభాగంలో దాదాపు 50-60% మార్కెట్ వాటాను కలిగి ఉంది.
note: స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications