Harsh Goenka Life Lesson: ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గొయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ చిన్న వీడియో వైరల్ అవుతోంది. పని గంటలపై ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఓ వ్యక్తి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తన జీవితకాలం మొత్తం పనిచేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా పంచుకున్నాడు.
ఆ వీడియోలో కంపెనీకి ఇంటర్న్‌షిప్ కోసం వచ్చిన ఓ విద్యార్థికి కంపెనీ యజమాని ఉద్యోగం ఇస్తాడు. అతని ఉద్యోగం ఏంటంటే.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట నాలుగు గీతలు గీచిన గడి మధ్య నిలబడటమే.. ఆ ఉద్యోగి ఇది చాలా సింపుల్ నేను చేస్తానంటూ ఆ ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగి రిటైర్ అయ్యే వరకు ఆ గీతల మధ్య తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. జీతం పెరిగింది అనే ఆనందం తప్ప మరేమి అతను సాధించలేకపోతాడు. చివరికి అతను రిటైర్ అయిన తరువాత యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటాడో అది చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే వయసు భారం కావడం వల్ల అతను చేయలేకపోతాడు.

వీడియో చివరలో ఓ మెసేజ్ ఉంటుంది. అదేంటంటే.. 9-5 పని దినాలు మీ జీవిత కాలం మొత్తాన్ని లాగేసుకుంటాయి. కాబట్టి ఆలస్యం కాకముందే మేల్కొండి అని ఉంటుంది. దీనిపై హర్ష గోయెంకా మీరు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండకుండా.. మార్పును స్వాగతించాలంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. 9-to-5 జీవితం నెమ్మదిగా నీ చలనాలను మింగేస్తుంది. ఒక రోజు మీకు 'స్వేచ్ఛ' అనే పదం గుర్తుకువస్తే మీ శరీరం దాన్ని ఆస్వాదించడానికి వయస్సు రీత్యా అనుమతించకపోవచ్చు అని తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలు స్పందిస్తున్నారు.
కొంతమంది గొయెంకాతో ఏకీభవించారు. మరికొందరు దీనిని వ్యతిరేకించారు. 9-5 షిఫ్టు ఉద్యోగికి వేసే ఒక ఎర. మీలో ఎంత ప్రతిభ ఉన్నా..రిటైర్మెంట్ తర్వాత మీ స్థానంలోకి మీరు వచ్చేస్తారు. కాబట్టి జీవితాన్ని ఆస్వాదించండి. సమయాన్ని వృథా చేయకండని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.మరొక నెటిజన్ మీరు ఎంత ప్రతిభావంతులు అయినా, ఒక రోజు మిమ్మల్ని ఉద్యోగం నుంచి బయటకు పంపిస్తారు. ఆలోచించక ముందే జీవితం పనిలో కూరుకుపోతుంది. కాబట్టి జీవితాన్ని వృథా చేయవద్దని ఒకరు కామెంట్ చేశారు.
Harsh Goenka Questions Relevance of the 9‑to‑5 Model
Wake up….before it’s too late! pic.twitter.com/mlQxDWXFcw
— Harsh Goenka (@hvgoenka) July 18, 2025
మరొకరు ప్రతి సంస్థకు ఇలాంటివారు అవసరం. అందరూ గోడ దూకితే నిర్మాణం కూలిపోతుందన్నారు. మరొకరు 9-టు-5లో ఒకసారి ఇరుక్కుపోతే అలవాటు బలమే మిమ్మల్ని మరిన్ని అవకాశాల నుంచి దూరం చేస్తుంది.20 ఏళ్లకు జాయిన్ అయి 60 ఏళ్ల వరకు పనిచేసే వారు కేవలం కొన్ని మెట్లు మాత్రమే ఎక్కగలరని అన్నారు. ఇంకొకరు RPG ఉద్యోగులకు ఇది గొప్ప సందేశం కదా అని చమత్కరించారు. మరొకరు ఉద్యోగులను ఎగతాళి చేయడం సులభమే కానీ దీని పరిష్కారం ఏమిటి? అని క్వశ్చన్ చేశారు.
హర్ష్ గోయెంకా అభిప్రాయం.. ఏదైమైనా ఈ రకమైన ఉద్యోగాలు మన జీవితాన్ని ఎలా ఆక్రమిస్తాయో చెప్పి ఇవి మాయలో పడొద్దు అంటూ RPG ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హెచ్చరించారు. ఈ పోస్ట్ ఒక హెచ్చరికలా అనిపించినా, ప్రతిఒక్కరికీ ఆచరణలో ఇది సాధ్యమా అన్న ప్రశ్న మిగిలిపోతుంది. పని-జీవిత సమతౌల్యం కాపాడుకోవడమే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాఠంగా దీనిని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications