Savji Dholakia: ఉద్యోగులు కలలో కూడా ఊహించని బహుమతులు అందించటంలో ఆయనే కలియుగ కర్ణుడని చెప్పుకోవచ్చు. కార్లు, ఇళ్లు అంటూ గతంలో అనేక బహుమతులను అందించిన గుజరాతీ వజ్రాల వ్యాపారి ధోలాకియా.. ఈ దీపావళికి ఉద్యోగల జీవితాల్లో వెలుగులు నింపే బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

1000 మంది ఉద్యోగులకు..
గుజరాత్ సూరత్‌లోని శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్టర్ అత్యంత ప్రసిద్ధ వజ్రాల కంపెనీల్లో ఒకటి. కంపెనీ తన 1000 మంది ఉద్యోగులకు దీపావళి మిలన్ వేడుకలను నిర్వహించింది. ఇందులో యజమాని గోవింద్‌భాయ్ ధోలాకియా తన ఉద్యోగికి దీపావళి కానుకగా సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను అందించారు. ఉద్యోగులను తన సొంత కుటుంబంలా భావించే ధోలాకియా వారికి జీవితకాలం కరెంట్ ఉచితంగా అందించేందుకు ఈ బహుమతిని అందించారు.

పర్యావరణ పరిరక్షణ..
కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఉద్యోగులు లాభపడటమే కాక.. పర్యావరణానికి సైతం మేలు జరగనుంది. ఇంతకు ముందు కూడా SRK నాలెడ్జ్ ఫౌండేషన్ ద్వారా SRK ఎక్స్‌పోర్టర్ సాంఘిక సంక్షేమ విభాగం ఆగస్టు నెలలో 750 మంది అమరవీరులైన సైనికులు, కరోనా వారియర్‌ల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ లను బహుమతిగా అందించారు.

ప్రతి ఏటా..
ప్రతి సంవత్సరం దీపావళికి మంచి ఖరీదైన కానుకలను అందించే ధోలాకియా గత ఏడాది ఉద్యోగులకు గ్యాస్ స్టవ్, సిలిండర్ లను అందించారు. 2014లో దీపావళి బోనస్‌గా తన ఉద్యోగులకు 491 కార్లు, 207 ఫ్లాట్లను బహుమతులుగా అందించారు. 2016లో 400 ఫ్లాట్లు, 1260 కార్లను బహుకరించారు. 2018లో కంపెనీలోని ముగ్గురు ఉద్యోగులకు దీపావళి బహుమతిగా ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కార్లను అందించారు. అంతే కాదు గోవింద్ ధోలాకియా తన సొంత గ్రామం అయిన దుధాలకు పూర్తిగా సోలార్ విద్యుత్ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చారు.


Click it and Unblock the Notifications