Multibagger Stocks: ఈ సంవత్సరం ఇప్పటివరకు కొన్ని స్మాల్‌క్యాప్ స్టాక్‌లు మాత్రమే మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి. హార్డ్‌విన్ ఇండియా(Hardwyn India) స్టాక్ కూడా ఈ జాబితాలో ఉంది. ఇది బీఎస్‌ఈలో కేవలం ఏడాది కాలంలోనే పెట్టుబడిదారులకు 476 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో.. 2018 నుంచి ఇప్పటి వరకు స్టాక్ దాదాపు 2,000 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ తన వాటాదారులకు ఉచితంగా బోనస్ షేర్లను అందించేందుకు సిద్ధమైంది. హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ అల్యూమినియం ఉత్పత్తులను ఉత్పత్తి, పంపిణీ చేస్తోంది.

ఉచిత బోనస్ షేర్లు..
హార్డ్‌విన్ ఇండియా సంస్థ తన ఇన్వెస్టర్లకు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వాలని నిర్ణయించింది. దీనిప్రకారం కంపెనీలో.. 2 షేర్లు కలిగి ఉన్న ప్రతి ఒక్క పెట్టుబడిదారునికి మరో షేర్ ఇవ్వబడుతుంది. కంపెనీ షేర్ల ఫేస్ వ్యాల్యూ రూ.10గా ఉంది. ఈ రోజు షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయి రూ.191 వద్ద ఉంది. జూలై 22న ఈ షేర్లు బీఎస్ఈలో రూ.181.45 స్థాయి వద్ద ముగిసింది. అయితే బోనస్ షేర్ల ప్రకటనతో షేర్ కొంత కరెక్షన్ కు గురైంది.

బోనస్ షేర్లు కావాలంటే..
ఇందుకోసం జూలై 26ను రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. అంటే.. ఈరోజు(25 జూలైన) స్టాక్ ఎక్స్-బోనస్ అవుతుంది. ఎవరైతే ఈ కంపెనీ షేర్లను ఈరోజు మార్కెట్ ముగిసేలోపు తమ డీమాట్ అకౌంట్లలో కలిగి ఉంటారో వారికి మాత్రమే కంపెనీ ప్రకటించిన బోనస్ షేర్లు అందుతాయి. రికార్డు తేదీలో షేర్లను కొనుగోలు చేయడం వల్ల బోనస్ షేర్లు లభించవని దయచేసి గమనించండి. ఈ కంపెనీ మంచి పనితీరును కలిగి ఉంది.

హార్డ్‌విన్ ఇండియా మల్టీబ్యాగర్ రిటర్న్స్..
25 ఏప్రిల్ 2018న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్లు రూ.9.98 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కంపెనీ షేర్లు 22 జూలై 2022న BSEలో రూ.181.45 వద్ద ముగిశాయి. కంపెనీ షేర్లు గత కొన్నేళ్లుగా ఇన్వెస్టర్లకు 2,624 శాతం రాబడిని ఇచ్చింది. ఒక వ్యక్తి 2018 ఏప్రిల్ 27న కంపెనీ షేర్లలో లక్షరూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే.. ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.19 లక్షలకు పైగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.190.75 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.30గా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications