ఇండియాలో సగం మందికి ఎస్ఐపి రకాల గురించి తెలియదు.. ఇలానే కన్ఫ్యూజ్ అవుతుంటారు..
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది క్రమం తప్పకుండ పెట్టె పెట్టుబడికి అనుకూలమైన మార్గం. ఈ ఎస్ఐపి మీ ఫైన్షియల్ టార్గెట్స్ సాధించడంలో సహాయపడుతుంది. దీని సౌలభ్యం అన్ని రకాల పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. సరైన ఫండ్ సెలక్షన్ అండ్ లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టడం మరింత ప్రయోజకంగా ఉంటుంది. కానీ, చాలా మందికి లేదా భారతదేశంలోని సగం మందికి ఎస్ఐపి రకాలు తెలియదు. అయితే ఎస్ఐపి ఎన్ని రకాలు, వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసా...
ఎస్ఐపి అంటే ఏమిటి?
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది పెట్టుబడి ప్లాన్, దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్లలో కేటాయించిన వ్యవధిలో నిర్ణయించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడిని ప్రతినెల, 3 నెలలు లేదా వారానికోసారి చేయవచ్చు.

ఎస్ఐపిలో 6 రకాలు ఉంటాయి
ఫ్లెక్సీ ఎస్ఐపి: ఇందులో పెట్టుబడిదారులు ప్రతి నెల పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవడం లేదా తగ్గించుకోనే ఫెసిలిటీ ఉంటుంది. ఈ సదుపాయం పెట్టుబడిదారుడి ఆదాయం ఇంకా ఖర్చుల ప్రకారం ఉంటుంది.
టాప్-అప్ ఎస్ఐపి: దీనిలో పెట్టుబడిదారులు ప్రతినెల ఎస్ఐపి మొత్తాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు. ఆదాయం పెరిగే కొద్దీ ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది.
Perpetual ఎస్ఐపి: ఈ ఎస్ఐపి ముగింపు లేని ఎస్ఐపి. పెట్టుబడిదారుడు దీన్ని మాన్యువల్‌గా మూసివేసే వరకు కొనసాగించవచ్చు.
స్టెప్-అప్ ఎస్ఐపి: ఇందులో, పెట్టుబడిదారులు ఎస్ఐపి మొత్తాన్ని ప్రతి సంవత్సరం కొంత శాతం పెంచుకునేలా సలెక్ట్ చేసుకోవచ్చు.
లక్ష్యం-ఆధారిత ఎస్ఐపి: ఇల్లు కొనడం, పిల్లల చదువు లేదా పదవీ విరమణ వంటి వారి కోసం రూపొందించారు.
మైక్రో ఎస్ఐపి: ఈ ఎస్ఐపి చిన్న మొత్తంతో ప్రారంభించాలనుకునే పెట్టుబడిదారుల కోసం. మైక్రో ఎస్ఐపి కింద పెట్టుబడిని రూ. 500 లేదా అంతకంటే తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. చిన్న పెట్టుబడిదారులు ఇంకా తక్కువ ఆదాయ వర్గాలకు ఇది బెస్ట్ అప్షన్.
ఎస్ఐపి నుండి రిటర్న్స్
ఎస్ఐపి రిటర్న్స్ మార్కెట్ పరిస్థితులు, ఫండ్ పర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటు వార్షిక రిటర్న్స్ 12-15% ఇచ్చాయి. ఉదాహరణకు, మీరు 10 సంవత్సరాల పాటు నెలకు రూ. 5,000 పెట్టుబడి పెట్టినట్లయితే ఇంకా రాబడి 12% ఉంటే, మీ మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షలు అవుతుంది. మీరు సుమారు రూ. 11.6 లక్షలు పొందుతారు.


Click it and Unblock the Notifications