For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే రెండేళ్లలో.. ఆ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ‘ఉఫ్’!

|

ఆర్థిక మాంద్యమా? అంటే.. అబ్బే కాదు మందగమనం అంటారు. కార్పొరేటు పన్ను రేట్లు తగ్గించాం కదా? మరి దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయా? తయారీ రంగంలో కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయా అంటే.. ఊహు.. అదీ లేదు.

మరోవైపు ఏటా కాలేజీలు, విశ్వ విద్యాలయాల నుంచి పట్టాలు పుచ్చుకుని బయటికొస్తున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. మరి ఇలా వస్తున్న వారు బతికేది ఎలా? ఏవీ ఉద్యోగాలు? నిరుద్యోగాన్ని రూపుమాపే యత్నాల్లో తలమునకలై ఉన్నామని చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా విజయం సాధిస్తున్నాయా? అంటే అదీ లేదు.

కొత్త కొలువుల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి. సాఫ్ట్‌వేర్, ఫార్మా, బ్యాంకింగ్, టెలికాం.. ఇలా ఏ రంగంలో చూసుకున్నా ఇదే పరిస్థితి. తాజాగా నిర్మాణ రంగం కుదేలైన క్రమంలో రానున్న రెండేళ్లలో రియల్‌ ఎస్టేట్‌ ఇతర అనుబంధ రంగాల్లో భారీగా కొలువుల కోత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 కొనుగోళ్లు లేక వెలవెలబోతోన్న నిర్మాణ రంగం...

కొనుగోళ్లు లేక వెలవెలబోతోన్న నిర్మాణ రంగం...

దేశవ్యాప్తంగా రూ.1.8 లక్షల కోట్ల విలువైన నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ ఇటీవల ఓ సర్వే నివేదికలో వెల్లడించింది. నిర్మాణం పూర్తయిన గృహాలు, వెంచర్లలో పలు యూనిట్లు చాలా కాలంగా విక్రయానికి నోచుకోకుండా పడి ఉన్నాయి. మరికొన్ని నిర్మాణాలు పూర్తి కాని స్థితిలో ఉండిపోయాయి. బిల్డర్లు, సంస్థలు ఆయా నిర్మాణాలపై భారీగా డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నా కొనే నాధుడు కనిపించడం లేదు. దేశంలో ఆర్థిక మందగమనం రాజ్యమేలుతోందనే వాదన సర్వత్రా వినిపిస్తోన్న నేపథ్యంలో కొనుగోలుదారులు జాగ్రత్త పడుతుండడంతో పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇచ్చిన రుణాలు తీర్చరు.. కొత్త రుణాలు ఇవ్వరు

ఇచ్చిన రుణాలు తీర్చరు.. కొత్త రుణాలు ఇవ్వరు

మరోవైపు నిర్మాణ రంగం కుదేలు కావడంతో ఆ ప్రభావం బ్యాంకులపైనా పడుతోంది. నిర్మాణాల కొనుగోలు పెద్దగా లేకపోవడంతో.. ఆయా కన్‌స్ట్రక్షన్ కంపెనీలు తమకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో కూడా లేవు. నిరర్ధక ఆస్తులు పెరుగుతుండడం, కంపెనీలు దివాలా తీస్తుండడంతో బ్యాంకులు సైతం సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. దీంతో దేశంలో తీవ్ర నగదు కొరత ఏర్పడుతోంది. ఇది మళ్లీ బ్యాంకింగ్‌, నిర్మాణ రంగాలకు పెద్ద సమస్యగా పరిణమిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇచ్చిన రుణాలే తీర్చకపోవడంతో బ్యాంకులు కొత్తగా నిర్మాణ రంగానికి రుణాలను ఇవ్వడం లేదు. దీంతో పరిస్థితి మరింత జటిలం అవుతోంది. ఇదంతా తిరిగి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంపై ప్రభావం చూపుతోందని నిపుణుల అంచనా.

వెనక్కి తగ్గుతోన్న పెట్టుబడిదారులు...

వెనక్కి తగ్గుతోన్న పెట్టుబడిదారులు...

సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గృహాలు, అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు వినియోగదారులు దూరంగా ఉంటున్నారు. దీంతో అద్దెలు కూడా పెద్దగా రావడం లేదు. మరోవైపు పెట్టుబడులు పెట్టి ఆయా నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో.. ఇన్వెస్టర్లు సైతం ఆస్తుల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. ఇలా ఒకదానికి ఒకటి గొలుసుకట్టులా మారి.. అమ్మకాలు తగ్గిపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న డెవలపర్లు వాటి తాలూకు వడ్డీ, ఈఎంఐలు చెల్లించలేక డిఫాల్ట్‌ అవుతున్నారని పారాడిగ్మ్‌ రియాల్టీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పార్థ్‌ మెహతా వ్యాఖ్యానించారు.

రెండేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు మటాష్!?

రెండేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు మటాష్!?

నిర్మాణ రంగం కుదేలైన క్రమంలో రాబోయే రెండేళ్లలో రియల్‌ ఎస్టేట్‌ ఇతర అనుబంధ రంగాల్లో దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ అంచనా వేసింది. ఇక సిమెంట్‌, స్టీల్‌ వంటి అనుబంధ పరిశ్రమలలోనూ పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగులపైనా ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇలా జరగకుండా ఉండేందుకు రియాల్టీ, కన్‌స్ట్రక్షన్ రంగాలు తిరిగి జవసత్వాలు పొందే దిశగా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary

వచ్చే రెండేళ్లలో.. ఆ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ‘ఉఫ్’! | half a million jobs may lost due to severe cash crunch in real estate

Projects worth 1.8 trillion rupees ($25 billion) are stalled across India, according to property consultancy firm Anarock. As developers go to the wall, more than half a million direct jobs may be lost in the coming months, the National Real Estate Development Council said. The number of indirect job losses from related industries like cement and steel may be even higher.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X