Prachand deal: పూర్తి స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రక్షణ రంగంలో సాధ్యమైనంత మేరకు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. దీంతో విదేశాలకు భిన్నంగా దేశీయ కంపెనీలకు పలు ఆర్డర్లను అప్పచెబుతోంది.
డిఫెన్స్ రంగంలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారీ ఆర్డర్ సొంతం చేసుకుంది. 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల సప్లై కోసం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రపోజల్ వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. భారత వైమానిక దళంతో పాటు సైన్యం కొనుగోలు చేసే హెలికాఫ్టర్‌ల టెండర్ విలువ 45 వేల కోట్లుకు పైగానే ఉంటుందని అంచనా.

'సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) రెగ్యులేషన్ 30, 2015 ప్రకారం.. 156 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేసిందని తెలియజేయాలనుకుంటున్నాము. ఇందులో భారత సైన్యం కోసం 90 మరియు ఎయిర్ ఫోర్స్ కోసం మిగిలిన 66 అందించాల్సి ఉంది' అని HAL తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ లైట్ కాంబాట్ హెలీకాఫ్టర్‌లకు మరోపేరు ప్రచండ్. 5 వేల మీటర్ల ఎత్తులో ల్యాండ్ మరియు టేకాఫ్ చేయగల ప్రపంచంలోని ఏకైక కాంబాట్ హెలికాప్టర్ ఇదే కావడం విశేషం. ఇవి సియాచిన్ హిమానీనదాలు మరియు తూర్పు లడఖ్‌లోని ఎత్తైన ప్రదేశాలలో పనిచేయడానికి అత్యంత అనువైనవిగా ఉంటాయి. ఎయిర్-గ్రౌండ్ మరియు ఎయిర్-ఎయిర్ ప్రయోగించే క్షిపణులను వీటితో లాంచ్ చేయవచ్చు. అంతేకాకుండా శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను నాశనం చేయగల సత్తా వీటి సొంతం.


Click it and Unblock the Notifications