AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.7 వేల కోట్ల పెట్టుబడితో 6 వేల మందికి ఉద్యోగాలు..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ తయారీ కంపెనీ హాయర్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రూ.7 వేల కోట్లతో ఏపీలో కొత్త తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇండియాలో కంపెనీకి ఇదే అతిపెద్ద పెట్టుబడిగా చెబుతున్నారు. హాయర్ కంపెనీకి ఇప్పటికే మహారాష్ట్రలోని పుణే, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలలో తయారీ ప్లాంట్ల ఉన్నాయి. తాజా పెట్టుబడితో దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టనుంది. ఈ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో 250 ఎకరాల భూమిని కేటాయించనుంది.
రూ.7 వేల కోట్ల పెట్టుబడిని రెండు దశల్లో పెట్టుబడి పెట్టనుంది. తొలి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. 2032 నాటికి ఈ పెట్టుబడులను పూర్తి చేస్తామని కంపెనీ తెలిపింది. తొలి దశ తయారీ కేంద్రం 2028 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 6 వేల మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి పరోక్షంగా.. మొత్తంగా 21 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 2028 నాటికి రూ.22 వేల కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఏర్పాటవుతున్న ఈ ప్లాంట్లో ఎయిర్ కండీషనర్లు (ఏసీ), వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కిచెన్ అప్లయన్సెస్లను తయారు చేయనున్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి--చెన్నై--నెల్లూరు ఎలక్ట్రానిక్స్ కారిడార్లో సత్యవేడు ఉండటం హాయర్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. నేషనల్ హైవే, రైల్వే, ఎయిర్పోర్టులకు దగ్గరగా ఉండటమే కాకుండా.. చెన్నై, ఎన్నూర్, కట్టుపల్లి, కృష్ణపట్నం లాంటి పెద్ద పోర్టులు కూడా దీనికి సమీపంలోనే ఉన్నాయి. ఫ్యాక్టరీ రావడం వల్ల కేవలం అందులో పనిచేసే వారికే కాకుండా.. బయట కూడా ఉపాధి పెరుగుతుంది. ముఖ్యంగా లారీలు, ట్రక్కులు, ప్యాకేజింగ్, గోడౌన్లు, లాజిస్టిక్స్ రంగాల్లో స్థానికులకు కొత్త వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని, పెట్టుబడులకు రాష్ట్రం అత్యంత అనుకూల వేదికగా మారుతోందని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications