వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా? హ్యాకర్లతో జాగ్రత్త!

ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా వైరస్ (కోవిడ్-19)‌ కారణంగా భయభ్రాంతులకు గురవుతుంటే.. మరోవైపు కంప్యూటర్ హ్యాకర్లు తమ చేతులకు పని చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను, అందులోనూ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. వారి మొబైల్స్, ల్యాప్‌టాప్‌లలోకి మాల్వేర్‌ను చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయాన్ని బెంగళూరుకు 'సుబెక్స్' అనే అనలటిక్స్ సంస్థ గుర్తించి హెచ్చరికలు చేసింది. హెల్త్, మ్యాన్యుఫాక్చరింగ్ సెక్టార్ల మినహా ఇతర అన్ని రంగాల్లో ఈ తరహా మాల్వేర్ దాడులను తాము గుర్తించినట్లు పేర్కొంది. అంతేకాదు, కరోనా అవుట్ బ్రేక్ తరువాత ఈ-మెయిల్స్, సోషల్ మీడియా లింక్స్, ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఫిషింగ్ దాడులు బాగా పెరిగాయట.

అప్పట్నించే సైబర్ దాడులకు ప్లాన్...

అప్పట్నించే సైబర్ దాడులకు ప్లాన్...

కంప్యూటర్ హ్యాకర్లు 2019 నుంచే సైబర్ దాడులకు సిద్ధమయ్యారట. ఆ ఏడాది ఆఖరి నాలుగు నెలల్లో వీరు భారీగా మాల్వేర్‌ను కొనుగోలు చేశారని, అలా కొనుగోలు చేసిన మాల్వేర్‌లను డిసెంబర్, జనవరి నెలల నుంచి వినియోగించడం ప్రారంభించారని టెలికాం కంపెనీలకు అనలటిక్స్ సేవలు అందించే సంస్థ ‘సుబెక్స్' చెబుతోంది. ఈ సంస్థకు 62 పట్టణాల్లో హనీపాట్ నెట్‌వర్క్ వ్యవస్థ ఉంది. ఇది హ్యాకర్లను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఒక డమ్మీ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాల్వేర్ కదలికలను ‘సుబెక్స్' గుర్తించింది.

 వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులే టార్గెట్...

వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులే టార్గెట్...

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ప్రస్తుతం వివిధ కార్పొరేట్, ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్' అవకాశం ఇస్తున్నాయి. అయితే దీనిని హ్యాకర్లు తమకు అనువుగా మలుచుకుని.. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. నిజానికి ఆయా కంపెనీలు తమ ఆఫీసుల్లో కల్పించినంత సైబర్ సెక్యూరిటీని ఉద్యోగుల ఇళ్ల వద్ద కల్పించలేవు. దీంతో హ్యాకర్లు గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, రౌటర్లను హ్యాక్ చేసి వాటిలో మాల్వేర్‌ను చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మాల్వేర్ ఒక్కసారి లొపలికి జొరబడితే...

మాల్వేర్ ఒక్కసారి లొపలికి జొరబడితే...

కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులను హ్యాకర్లు తమకు అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరు ఉద్యోగులు ఉపయోగించే డివైజ్‌ల ఆధారంగా ఆయా నెట్‌వర్క్‌లలోకి జొరబడి తక్షణమే హ్యాక్ చేయొచ్చు.. లేదంటే కొంతకాలం ఆగి నెట్‌వర్క్‌ను హ్యాక్ చేయడానికి వీలుగా అందులోకి ట్రోజన్‌ను చొప్పించడంగానీ చేయొచ్చు. ఇలా హ్యాకింగ్‌కు గురైన డివైజ్‌లు బాట్స్‌ మాదిరిగా పనిచేస్తాయని, బాట్‌నెట్‌కు కనెక్ట్ అయి, సదరు ఉద్యోగులు తమ ఆఫీసు నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన వెంటనే ఇవి సైబర్ దాడులు నిర్వహిస్తాయని అనలటిక్స్ సంస్థ ‘సుబెక్స్' కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రయుక్త్ కె.వి. చెబుతున్నారు.

ఈ తరహా ఫైల్స్‌తో జాగ్రత్త...

ఈ తరహా ఫైల్స్‌తో జాగ్రత్త...

హ్యాకర్లు దాదాపు 23 రకాల కామన్ ఫైల్ ఎక్స్‌టెన్షన్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో docs, xlsx, eps, mp3, mp4, zip, rar వంటి ఫైల్స్ ఉన్నట్లు ‘సుబెక్స్' వెల్లడించింది. వీటిలో ఎన్‌క్రిప్టెడ్ మాల్వేర్ ఉంటోందని, కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులు అనుమానాస్పద ఫైల్స్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం డౌట్ వచ్చినా అలాంటి ఫైల్స్, లింక్స్‌పై క్లిక్ చేయకపోవడమే మంచిదని చెబుతోంది. హ్యాకర్లు ముఖ్యంగా ‘‘corona_health_update.pdf, origin-of-corona_cnn.mp4, covid19_mandatory_work_from_measures.pdf, corona_safety_alert.docs, secondary_corona_infections.pdf వంటి ఫైల్స్ ఉపయోగిస్తున్నారని, అలాగే ప్రభుత్వాలు కరోనా వైరస్‌కు సంబంధించి ప్రకటనలు చేసినప్పుడల్లా ఈ మాల్వేర్ ఫైల్స్‌ను హ్యాకర్లు మార్చుతున్నట్లు తాము గుర్తించామని..'' సుబెక్స్ సంస్థ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+