H-1B Visas Under Fire: ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ ఉద్యోగాల విధానంపై దృష్టి మరింత పెట్టింది. తాజాగా అమెరికా కార్మిక శాఖ (U.S. Department of Labor) సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక కొత్త వీడియో ప్రకటన ఈ మార్పును బలంగా ప్రతిబింబిస్తోంది. American Dream Stolen అనే శీర్షికతో విడుదలైన ఈ ప్రచారం, కంపెనీలు H-1B వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, తక్కువ వేతనాలపై విదేశీ కార్మికులను నియమించడం ద్వారా యువ అమెరికన్ల అవకాశాలను హరించాయని ఆరోపిస్తుంది.
ఈ ప్రకటనలో భారత్‌ను ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లబ్ధిదారుగా హైలైట్ చేశారు. ప్రస్తుతం జారీ అయ్యే H-1B వీసాల్లో సుమారు 72 శాతం భారతీయ పౌరులకే వెళ్తున్నాయని, ఇది టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాల్లో అత్యధికమని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రకటనలో స్పష్టంగా చెప్పకపోయినా, వీడియోలో చూపించిన గణాంకాలు, టెక్స్ట్‌లు భారతీయ ఐటీ నిపుణులను లక్ష్యంగా చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

వీడియోలో 1950ల కాలం నాటి అమెరికా దృశ్యాలను చూపిస్తూ.. ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న అమెరికన్లు, సంతోషంగా జీవిస్తున్న కుటుంబాలు.. The American Dream was built on hard work and opportunity అనే లైన్‌తో ప్రారంభమవుతుంది. కానీ తరువాతి సెకన్లలో That dream was stolen from young Americans అనే పదాలతో వీసా దుర్వినియోగం కారణంగా యువతకు అవకాశాలు కోల్పోయినట్లు చూపిస్తుంది. వీడియో చివరలో కార్మిక శాఖ ట్యాగ్‌లైన్‌గా We're taking back the American Dream for the American people అని పేర్కొంది.
ఈ ప్రచారంతో సమాంతరంగా Labor Department 2025 సెప్టెంబర్‌లో ప్రారంభించిన Project Firewall కార్యక్రమం H-1B వీసా దరఖాస్తులపై కఠినమైన ఆడిట్‌లను చేపట్టనుంది. దీని లక్ష్యం ఏంటంటే.. అమెరికన్ కార్మికులను తక్కువ వేతనాలపై నియమించే విదేశీ వర్కర్లతో భర్తీ చేయకుండా కార్పొరేట్ కంపెనీలను అడ్డుకోవడం అని చెప్పవచ్చు.ఒక అమెరికన్ ఉద్యోగం ముందుగా ఒక అమెరికన్‌కే చెందాలి. మేము చట్టబద్ధమైన వలసలకు వ్యతిరేకం కాదు, దాని దోపిడీకి వ్యతిరేకం అని వీడియో చెబుతోంది.
ట్రంప్ పరిపాలన ఈ ప్రకటన ద్వారా స్పష్టంగా తమ America First Jobs Policyను మళ్లీ ప్రాముఖ్యం కలిగిస్తోంది. వీసా ఆడిట్‌లు, దేశీయ నియామకాలకు ప్రాధాన్యం,కార్మిక మార్కెట్‌లో జాతీయవాద దృక్పథం.. ఇవన్నీ మళ్లీ ముందుకు వస్తున్నాయి. విశ్లేషకులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇది కేవలం ఆర్థిక సందేశం మాత్రమే కాదు. ఇది రాజకీయంగా కూడా ఒక స్పష్టమైన సంకేతం. రాబోయే ఎన్నికల ముందు ట్రంప్ పరిపాలన అమెరికన్ యువతకు మేము మీ ఉద్యోగాలను కాపాడతాం అనే హామీ ఇస్తోందని పేర్కొంటున్నారు.
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా H-1B వీసా లబ్ధిదారులలో అగ్రస్థానంలో ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ వంటి సంస్థలు అమెరికా టెక్ రంగానికి వేలాది మంది నిపుణులను పంపిస్తాయి. కొత్త నియంత్రణలు, ఆడిట్‌లు, రాజకీయ ఒత్తిడి ఈ కంపెనీల వీసా అనుమతులపై ప్రభావం చూపవచ్చని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.
More From GoodReturns

భారత ఐటీ రంగంలో కల్లోలం.. రెండు వైపుల నుంచి తరుముకొస్తున్న రిస్క్.. నిర్మల్ బాంగ్ సంచలన నివేదిక..

ఐటీ స్టాక్స్ Q4 ఫలితాలు..TCS, ఇన్ఫోసిస్ నుండి HCL టెక్ వరకు.. షేర్లు కొనుగోలుపై బిగ్ అలర్ట్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications