అమెరికాలో పనిచేస్తున్న టెకీలకు ట్రంప్ సర్కారు భారీ షాకిచ్చింది. ఇక్కడ పనిచేస్తూ అనుమతికి మించి భారతదేశంలో ఎక్కువ రోజులు గడిపారంటూ టెకీలను అమెరికా వెనక్కి పంపించి వేసింది. వారి హెచ్-1బి వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మీరు అమెరికాలో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన ముగ్గురు టెకీల హెచ్-1బి వీసా
రద్దు చేసింది యూఎస్.అయితే వారికి అన్ని అర్హతలు ఉన్నా భారత్ లో ఎక్కువ రోజులు నివసించారనే కారణంతోనే ఈ వీసాలను రద్దు చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
ఇంతకీ కథ ఏంటంటే..అమెరికాలో జాబ్ చేసేందుకు ముగ్గురు ఇండియన్లు H-1B వీసాలను కలిగి ఉన్నారు. ఈ వ్యక్తులు భారతదేశానికి వచ్చి ఎక్కువ కాలం ఉన్నారు. ఓ టెకీ మూడు నెలలు దేశంలో ఉండగా మరో ఇద్దరు టెకీలు మూడు నెలలకు పైగా స్వదేశంలోనే ఉన్నారు.అయితే వారు ఎక్కువ రోజులు భారత్ లో ఉండటానికి కంపెనీలు కూడా అనుమతించాయి. దీనికి తగిన రుజువులు కూడా వారి వద్ద ఉన్నాయి. తాజాగా వీరిని అమెరికాకు తిరిగి రావాలని కంపెనీ యజమానులు లేఖలు రాశారు.

ఈ నేపథ్యంలోనే వారు అమెరికాకు తిరిగి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అబుదాబి నుంచి అమెరికాకు వెళ్లేందుకు ప్రయాణికులు సరంజామా సర్దుకున్నారు. అయితే వారికి అబుదాబి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురయింది. రెండు నెలలకు పైగా భారత్ లో ఉన్నందుకు అబుదాబిలో ఉన్న యుఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటక్షన్ అధికారులు వారిని వెనక్కి పంపించి వేశారు. విమానాశ్రయంలో యుఎస్ కస్టమ్స్ అధికారులు వీరి వీసాలను తనిఖీ చేసి మీరు అనుమతికి మించి భారత్ లో ఉన్నారని కాబట్టి అమెరికా విమానం ఎక్కడానికి వీళ్లేదని తేల్చి చెప్పారు.
వారు అన్ని రకాల డాక్యుమెంట్లు చూపించినప్పటికీ యుఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అమెరికాకు వెళ్లేందుకు అనుమతించలేదు. అబుదాబి విమానాశ్రయంలో ఉన్న US కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (CBP)మా వీసాలను రద్దు చేసి పంపిందని ఈ టెకీలు తమ ఆవేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
సాధారణంగా అమెరికాలో హెచ్-1బి వీసా మీద ఉద్యోగం చేసే ఉద్యోగులు ఏడాదిలో రెండు నెలల పాటు యుఎస్ వెలుపల గడిపేందుకు అనుమతి ఉంటుంది. అయితే వీరు మూడు నెలలకు పైగా వెలుపల ఉండటంతో ఈ టెకీల వీసాలు రద్దయ్యాయి. కాబట్టి హెచ్-1బి వీసా మీద అమెరికాలో పనిచేసేవారు 30 నుంచి 40 రోజులు మాత్రమే యుఎస్ వెలుపల ఉండేలా ప్లాన్ చేసుకోవాలని పలువురు సలహాలు ఇస్తున్నారు.
హెచ్-1బి వీసా అనేది యుఎస్ కంపెనీలలో విదేశాల నుంచి వచ్చిన కార్మికులకు మంజూరు చేసే వీసా.. ఇది తాత్కాలికంగా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఇస్తుంది. వీసాను యుఎస్ కంపెనీలు జారీ చేస్తాయి. ఈ వీసాపై అమెరికాలో ఆరు సంవత్సరాలు మాత్రమే ఉండాలి. ఆ తరువాత ఉండటానికి వీల్లేదు. అయితే యుఎస్ ప్రభుత్వానికి ఫారమ్ I-129 సమర్పిస్తే దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది.
దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మీరు అమెరికాలో పని చేస్తుంటే ఇండియాలో మూడు నెలలు ఎవరు ఉండమన్నారని ఒకరు ప్రశ్నిస్తే..మరొకరు మీ అజాగ్రత్తకు మీరే బాధ్యులు అని వారిని నిందించారు. వీసా అనేది ప్రత్యేక హక్కు అయితే మీరు దాన్ని ఎందుకు కాపాడుకోలేదంటూ మరొకరు మండిపడ్డారు.


Click it and Unblock the Notifications