అమెరికాలో ఉన్న వేలాది భారతీయ H-1B visa హోల్డర్ల కుటుంబాలకు ట్రంప్ సర్కారు బిగ్ షాకిచ్చింది. యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఈ మధ్య కాలంలో తీసుకున్న కీలక నిర్ణయం వల్ల ఎన్నారై పిల్లల గ్రీన్ కార్డు కల చెదిరిపోనుంది. తాజా న్యూస్ ఏంటంటే.. H-1B వీసా హోల్డర్ల పిల్లలు 21 సంవత్సరాల వయస్సు వచ్చే లోపు వారి తల్లిదండ్రుల గ్రీన్ కార్డు దరఖాస్తు పూర్తి అయి ఉండాలి.
అలా కాకుండా పెండింగ్‌లో ఉంటే ఆ దరఖాస్తు ఆధారంగా వారి పిల్లలు గ్రీన్ కార్డు పొందే హక్కును కోల్పోతారు. దీని ప్రకారం..ఏళ్ల పాటు అమెరికాలో చదువుకుంటూ, అక్కడే పెరిగిన పిల్లలు ఒక్క వయస్సు కారణంగా చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (Green Card) కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. వైట్ హౌస్ తీసుకువచ్చిన ఈ మార్పులు 2025 ఆగస్టు 15 నుండి అమల్లోకి రానున్నాయి.
USCIS తెలిపిన వివరాల ప్రకారం.. వీసా అందుబాటులోకి వచ్చిన సమయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ వీసా బులెటిన్‌లోని Final Action Dates Chart ఆధారంగా లెక్కించనున్నారు. ఈ తాజా మార్పు Child Status Protection Act (CSPA) కింద వయస్సు లెక్కింపు విధానాన్ని ప్రభావితం చేస్తుందని ప్రకటన తెలిపింది. అయితే ఇందులో ఓ ఊరట కలిగే వార్త ఉంది. ఆగస్టు 15, 2025కి ముందు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల విషయంలో మాత్రం పాత విధానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2023 ఫిబ్రవరి 14న అమల్లోకి వచ్చిన CSPA వయస్సు లెక్కింపు విధానాన్ని ఆగస్టు 15, 2025కి ముందు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కొనసాగిస్తామని USCIS స్పష్టం చేసింది.

ఇప్పటివరకు అమెరికాలో 21 ఏళ్లు నిండకముందే గ్రీన్ కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉండటం వల్ల పిల్లలకు ఈ కార్డు మీద అర్హత ఉండేది. అయితే కొత్త నియమాల ప్రకారం.. వీసా సంఖ్య అందుబాటులోకి వచ్చిన ఒక సంవత్సరం లోపు శాశ్వత నివాస హోదా కోసం చర్యలు తీసుకోకపోతే.. ఆ అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఈ గడువును మినహాయిస్తామని USCIS తెలిపింది.
పాత విధానంలో అమెరికాలో ఉండి హోదా సర్దుబాటు (Adjustment of Status) కోసం దరఖాస్తు చేసిన వారికి, అమెరికా వెలుపల వలస వీసా కోసం దరఖాస్తు చేసిన వారికి వేర్వేరు లెక్కింపు ప్రమాణాలు ఉండేవి. ఈ అసమానతను తొలగించడానికి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది USCIS. అయితే తాజా నిర్ణయంతో హామీ H-1B కుటుంబాలకు మాత్రం నష్టం కలిగే అవకాశం ఉంది. అమెరికాలో ఇండియన్ అప్లికెంట్స్‌కి గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ టైమ్ ఇప్పటికే దశాబ్దాల సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో వారికి గ్రీన్ కార్డు ఒకే అయ్యే సరికి పిల్లలు 21 సంవత్సరాల వయస్సు దాటిపోవడం దాదాపు ఖాయమని చెప్పుకోవచ్చు. దీంతో వారి పిల్లలు తల్లిదండ్రుల పిటిషన్ ఆధారంగా గ్రీన్ కార్డు పొందలేరు.
అమెరికా తాజా ప్రకటనతో అమెరికాలో ఉంటున్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి అయోమయంలో పడ్డారు.చదువులు పూర్తిచేసి అమెరికాలో కెరీర్‌ను కొనసాగించాలని అనుకునే ఈ పిల్లలు ఈ నిబంధన కారణంగా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంచి భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన వారికి ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అది కలగానే మిగిలిపోనేంది.
ఈ పరిస్థితులు ఇలా ఉంటు అమెరికా హెచ్-1బీ వీసా మంజూరు విధానంలో పెద్ద మార్పుకు మార్గం సుగమమైంది ట్రంప్ సర్కారు. బ్లూమ్‌బర్గ్ లా రిపోర్ట్ ప్రకారం, ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫేర్స్ (OIRA) లాటరీ పద్ధతికి ముగింపు పలుకుతూ.. నైపుణ్యం, అధిక ఆదాయాలను ప్రామాణికంగా తీసుకునే కొత్త నిబంధనకు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం హెచ్-1బీ వీసాలు సంవత్సరానికి గరిష్ఠంగా 85 వేల వరకు మాత్రమే మంజూరు అవుతున్నాయి. ఈ వీసాల పంపిణీకి లాటరీ విధానం అమలు చేశారు, అందువల్ల దరఖాస్తుదారుల ఎంపిక పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగేది. అయితే రానున్న కొత్త విధానం ప్రకారం.. వీసా దరఖాస్తులను అభ్యర్థుల జీతాల స్థాయి ఆధారంగా ఇవ్వనున్నారు. ఎక్కువ వేతనం పొందుతున్న లేదా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు మొదటగా ఎంపికగా చేయనున్నారు. అయితే ఈ విధానాన్ని 2021లోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) అమల్లోకి తెచ్చింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తెర పైకి తీసుకువచ్చింది.
అయితే.. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఈ కొత్త నియమాలపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అమలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నిబంధన అమలులోకి వస్తే.. లాటరీ అదృష్టంపై ఆధారపడే కాలం ముగిసిపోతుంది. అధిక వేతనంతో కూడిన నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు ఉన్నవారికే హెచ్-1బీ అవకాశాలు లభించనున్నాయి.
More From GoodReturns

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

Strait of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏమిటి? దీన్ని బ్లాక్ చేస్తే భారత్కు నష్టమేంటి?

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications