అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలకమైన నిర్ణయంతో ముందుకు వచ్చారు. తాజాగా వచ్చిన వార్త ఏంటంటే.. H-1B వీసా లాటరీకి ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికి కొత్త వెయిటెడ్ సెలక్షన్ విధానం అమల్లోకి తీసుకురాబోతోంది. H-1B వీసా జారీ విధానంలో కీలక మార్పులను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. జూలై 17న హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) ఒక ఫైల్ సమర్పించింది. అందులో లాటరీ విధానం స్థానంలో వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్ ప్రవేశపెట్టాలని ట్రంప్ ప్రతిపాదించారు. ప్రస్తుతం H-1B వీసాల కోసం దరఖాస్తుల సంఖ్య, అందుబాటులో ఉన్న వీసాల కంటే చాలా ఎక్కువగా ఉండటం వల్ల లాటరీ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.
H-1B వీసా ప్రోగ్రామ్ అనేది అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలకు అత్యంత ముఖ్యమైన సాధనంగా ఉంటోంది. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికాలో పనిచేసేందుకు ఈ వీసాను కంపెనీ ఉపయోగించుకుంటోంది. అయితే వీరిలో అధికమంది భారత్ నుండి ఈ వీసా ద్వారా అమెరికాకు వెళుతున్నారు. 2022లో మొత్తం 3.2 లక్షల H-1B వీసాలు జారీ చేస్తే అందులో 77 శాతం భారతీయులే ఉన్నారు. ఇక 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా 3.86 లక్షల వీసాలలో 72.3 శాతం భారతీయులే కలిగి ఉన్నారు.

DHS ఫైలింగ్ ప్రకారం.. కొత్త వెయిటెడ్ సెలక్షన్ పద్ధతి వార్షిక పరిమితి (క్యాప్) ఉన్న వీసాలపైనే వర్తిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం 85,000 వీసాలకే పరిమితి ఇస్తుంది. అందులో 20 వేలు మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకన్నా ఉన్నతమైన విద్యార్హత కలిగిన వారికి కేటాయిస్తారు. US Citizenship and Immigration Services (USCIS) ఆధ్వర్యంలో ఈ వీసా కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం అన్ని దరఖాస్తుదారులను సమానంగా పరిశీలనలోకి తీసుకుంటోంది. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు అధిక సంఖ్యలో H-1B వీసా దరఖాస్తులను పంపించడం వల్ల ఎక్కువ వీసాలను అవే పొందుతున్నాయి. యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు మాత్రం ఈ పరిమితి నుండి మినహాయింపుతో ఏడాది పొడవునా వీసాలు పొందగలుగుతున్నాయి.
ఇక H-1B వీసాలను జీతం ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వడం అనే ఆలోచన కొత్తదేమి కాదని చెప్పుకోవచ్చు. 2024 జనవరిలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ (IFP) అనే పరిశోధన సంస్థ,జెరెమీ ఎల్. న్యూఫెల్డ్ తో కలిసి ఒక నివేదిక తయారు చేసింది. ఈ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. లాటరీకి బదులుగా జీతం ఆధారంగా ర్యాంకింగ్ సిస్టమ్ తీసుకొస్తే H-1B వీసా కార్మికుల సగటు జీతం భారీగా పెరిగే అవకాశం ఉంది. 106,000 డాలర్ల నుండి 172,000 డాలర్ల వరకు పెరుగుతుంది.
ఇది అమెరికా ఉద్యోగ మార్కెట్‌లో పెద్ద మార్పులు తెస్తుందని వారు తెలిపారు. ఈ మార్పుతో తక్కువ జీతాలపై ఆధారపడే అవుట్‌సోర్సింగ్ సంస్థలకు అక్కడ పెద్ద ఎదురుదెబ్బ అయితే తగలనుంది. దీనికి తోడు అధిక నైపుణ్యం కలిగిన వ్యక్తులు మరింతగా వీసాలు పొందే అవకాశం ఉంది.Ph.D. హోల్డర్లు కూడా ఈ జాబితాలో వీసాలు పొందే అవకాశం ఉంది. వారి నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే జీతం, సీనియారిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, H-1B ప్రోగ్రామ్ యొక్క ఆర్థిక విలువ 88 శాతం పెరిగే అవకాశం ఉంటుంది.
ఎకనామిక్ ఇన్నోవేషన్ గ్రూప్ పరిశోధకుడు కానర్ ఓ'బ్రియన్ ఒక పోస్ట్‌లో దీనిపై ఆసక్తికర విషయాన్నిపంచుకున్నారు. H-1B లాటరీని ముగించి వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని తీసుకురావడం సరికొత్త దిశ అని తెలిపారు. ముఖ్యంగా అధిక జీతాలు, మంచి నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అమెరికాకు నిజమైన ప్రతిభ వస్తుందని తెలిపారు. H-1B లాంటి కీలక వీసాలను యాదృచ్ఛికంగా కేటాయించడం అనవసరమని నొక్కి చెప్పారు. అమెరికా మరింత అర్హత గల టాలెంట్‌ను ఆకర్షించగలదని తెలిపారు.
ప్రస్తుతం DHS ఈ ప్రతిపాదనపై పరిశీలన జరుపుతోంది. అయితే ఇది వచ్చే ఏడాది H-1B దరఖాస్తులపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే ఈ నియమం అమల్లోకి వస్తే మాత్రం భారత IT, అవుట్‌సోర్సింగ్ సంస్థలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications