అమెరికా నుంచి వచ్చిన తాజా వార్త భారతీయ ఐటి టెకీలు, ప్రొఫెషనల్స్‌కు కొంచెం షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్, ప్రస్తుతం అమల్లో ఉన్న H-1B వీసా వ్యవస్థను "మోసం"గా పిలుస్తూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో, ఈ వీసాల వల్ల అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలు విదేశీయులు దక్కించుకుంటున్నారు. అందుకే దీనిలో పెద్ద మార్పులు తప్పనిసరిగా రాబోతున్నాయని చెప్పారు.

H-1B వీసా ఎందుకు ముఖ్యమంటే?
ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటి ఉద్యోగుల్లో చాలా మంది H-1B వీసాలపైనే ఆధారపడి ఉన్నారు. ఇది ఒక రకమైన వర్క్ పర్మిట్ లాంటిది. అమెరికా కంపెనీలు స్థానికంగా దొరకని నైపుణ్యం కోసం ఇతర దేశాల నుండి ఉద్యోగులను తీసుకురావడానికి ఈ వీసా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇండియాకు చెందిన టెకీలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు దీనివల్లే చాలా మంది వాళ్ళ అమెరికా డ్రీమ్‌ను నిజం చేసుకున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలోనే 72% H-1B వీసాలు భారతీయులకే వచ్చాయి. అంటే ఇందులో ఏదైనా మార్పు జరిగితే, ఇండియన్ టెకీలకే పెద్ద షాక్ అవుతుంది.
ఇప్పటి వరకు H-1B వీసాలను లాటరీ సిస్టమ్ ద్వారా కేటాయించేవారు. ఎవరు అప్లై చేసినా, అదృష్టం ఉంటే వీసా వస్తుంది. కానీ లుట్నిక్ మాటల్లో, ఈ విధానం అమెరికాకు నష్టమని అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, తక్కువ వేతనాలకు పనిచేయడానికి సిద్ధమయ్యే విదేశీయులు లాటరీ ద్వారా ఎంపికవుతారు, దీని వల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు దక్కడం కష్టమవుతుంది. అందుకే లాటరీ సిస్టమ్‌కి గుడ్‌బై చెప్పి, శాలరీ ఆధారంగా ఎంపికని తీసుకురాబోతున్నారు. ఎవరు ఎక్కువ శాలరీ, నైపుణ్యం కలిగి ఉంటే, వారికి వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
లుట్నిక్ చెప్పిన మరో ముఖ్యమైన అంశం గ్రీన్ కార్డు వ్యవస్థ. ఆయన ఇలా ఉదాహరణ ఇస్తూ ఒక సగటు అమెరికన్ వార్షికంగా $75,000 సంపాదిస్తాడు, కానీ గ్రీన్ కార్డు హోల్డర్ మాత్రం $66,000 మాత్రమే సంపాదిస్తాడు. అంటే, అమెరికాలోకి తక్కువ సంపాదించే వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామన్నది ఆయన అభిప్రాయం. ఇక నుంచి ఎక్కువ సంపాదన, నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే అమెరికా గ్రీన్ కార్డు ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమస్యకు పరిష్కారంగా, ట్రంప్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను ఆలోచిస్తోంది. దాని పేరు "గోల్డ్ కార్డ్." దీని కింద కనీసం $5 మిలియన్ పెట్టుబడి పెట్టే విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసం ఇచ్చే అవకాశం ఉంటుంది. లుట్నిక్ చెప్పినట్టే, ఇప్పటికే ఈ కార్డ్ కోసం 2.5 లక్షల మంది ఆసక్తి చూపుతున్నారు. ఇది జరిగితే, అమెరికాలోకి సుమారు $1.25 ట్రిలియన్ పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
దీని వల్ల ఎక్కువ ఇబ్బంది పడేది భారతీయులే. ఎందుకంటే H-1B వీసా హోల్డర్లలో 70% పైగా ఇండియన్లే. చైనాకు కేవలం 11% మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 65,000 వీసాలు, అదనంగా అమెరికాలో మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి 20,000 వీసాలు లాటరీ ద్వారా ఇస్తున్నారు. ఈ విధానం మారిపోతే, తక్కువ శాలరీపై పనిచేసే భారతీయ టెకీలు అమెరికాలో ఉద్యోగం పొందడం మరింత కష్టమవుతుంది.
ఇలా మార్పులు జరిగితే, అమెరికాలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు, పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే డోర్లు ఓపెన్ అవుతాయి. కానీ భారత్‌లోని ఎక్కువ మంది టెకీలు తక్కువ నుండి మధ్యస్థాయి శాలరీల పైనే అమెరికా చేరుతారు. కాబట్టి ఈ మార్పులు వారికి పెద్ద సవాల్ కావడం ఖాయం.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications