H-1B Visa Chaos: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా H-1B వీసా రుసుము నిర్ణయం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. సుమారు లక్ష డాలర్లు (రూ. 83 లక్షలు) వరకు పెరిగిన ఈ ఫీజు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి అమెరికా కలలు కంటున్న వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్ధులు, కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
తాజా అంచనాల ప్రకారం.. మొత్తం H-1B వీసా దరఖాస్తుల్లో 10 నుంచి 15 శాతం తెలుగు రాష్ట్రాల వారివే. భారతీయులు మొత్తం కేటాయింపుల్లో 70 శాతం పైగా ఉన్నందున వేలాది మంది తెలుగు గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, టెక్ నిపుణులు ఈ నియమాల భారాన్ని మోయాల్సి వస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అనేక మంది విద్యార్థులు F-1 వీసా, OPT (Optional Practical Training) కింద పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త రుసుము వల్ల H-1Bకి మారడం అసాధ్యమవుతోంది.
భారతదేశం నుంచి వెళ్లిన చాలామంది ప్రస్తుతం F-1 వీసాలపై అక్కడ ఉన్నారు. దీని నుంచి తర్వాత OPT ఆ తర్వాత H-1Bకి మారాలనేది అక్కడ ఉన్న యువ తెలుగు గ్రాడ్యుయేట్లు ప్లాన్. OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అనేది F-1 వీసా కింద ఒక ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ఇది విదేశీ విద్యార్థులు తమ అధ్యయన రంగానికి నేరుగా సంబంధించిన ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు కొద్ది రోజుల పాటు USలో పని చేయడానికి అనుమతి ఇస్తుంది.

అర్హత కలిగిన F-1 విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌కి ముందు లేదా తర్వాత గరిష్టంగా 12 నెలల వరకు OPT అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్) రంగాలలో చదివిన గ్రాడ్యుయేట్లు, అదనంగా 24 నెలల పొడిగింపు పొందవచ్చు. ఈ పొడిగింపుతో వారు మొత్తం 36 నెలల వరకు అమెరికాలో చట్టబద్ధంగా పని చేసే అవకాశం పొందుతారు. ఆ తరువాత వారు H-1B వీసాకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
USCIS (US Citizenship and Immigration Services) ప్రకారం.. సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసే అన్ని కొత్త H-1B పిటిషన్లకు ఈ కొత్త రుసుము వర్తిస్తుంది. ఇది ఇప్పటికే అమెరికాలో ఉన్న వారిపైనా వర్తిస్తుందని స్పష్టత లేదు. కానీ యజమానులు భయంతో కొత్త నియామకాలను ఆపేస్తున్నారు.తెలుగు యువతకు ఇది కేవలం ఉద్యోగ సమస్య కాదు. ఇది సామాజిక ప్రభావాన్ని కూడా చూపుతోంది. అమెరికాలో స్థిరపడిన వరుడిని కనుగొనడం గతంలో గర్వకారణం కాగా.. ఇప్పుడు అదే వివాహ మార్కెట్లో ఆందోళనగా మారింది.
హైదరాబాద్‌లోని వివాహ సంస్థలు చెబుతున్న వివరాల ప్రకారం.. వధువుల కుటుంబాలు ఇప్పుడు గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉన్న వరులను మాత్రమే ఇష్టపడుతున్నాయని చెబుతున్నాయి. 100,000 డాలర్ల ఫీజు చెల్లించగలరా? వీసా భవిష్యత్తు ఏమిటి? అన్న ప్రశ్నలు ప్రతి సంభాషణలో వినిపిస్తున్నాయి. అమెరికాలో పనిచేస్తున్న తెలుగు టెకీ సంతోష్ చెప్పినట్లుగా..గతంలో H-1B ప్రాసెస్ చేయడానికి కొన్ని వేల డాలర్లే ఖర్చయ్యేవి. ఇప్పుడు 100,000 డాలర్లుఅంటే యజమానులు రెండుసార్లు ఆలోచిస్తారు. ఫలితంగా అవకాశాలు తగ్గిపోతున్నాయంటున్నారు.
ఇంతలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా భక్తుల రద్దీ తగ్గలేదు. వీసా దరఖాస్తులు విజయవంతం కావాలని ప్రార్థించే యువత ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆలయ పూజారి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఇది కేవలం డబ్బు సమస్య కాదు, ఇది మనోధైర్యానికి పరీక్ష అని చెబుతున్నారు. H-1B రుసుము పెంపుతో, అమెరికా వీసా లాటరీకి ప్రయత్నిస్తున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు, యజమానులు స్పష్టమైన మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు.
నిపుణుల ప్రకారం, ఈ విధానం అమెరికాలోని కంపెనీలకు ప్రతిభా కొరతను తెచ్చిపెట్టవచ్చు. తక్కువ బడ్జెట్ ఉన్న సంస్థలు ఈ ఉద్యోగాలను ఇండియాలోనే అవుట్‌సోర్స్ చేయవచ్చని అంచనా. కిషోర్, సంతోష్, ఆదిత్య వంటి తెలుగు యువతకు.. అనిశ్చితి ఇప్పుడు జీవన భాగమైంది. మన జీవితాలు ఎప్పుడూ తాత్కాలికంగానే అనిపిస్తాయి. కానీ ఇప్పుడు అది మరింత స్పష్టమవుతోందని ఆదిత్య అన్నారు.
లక్షడాలర్ల H-1B ఫీజు ఒక వీసా రుసుము మాత్రమే కాదు.. అది అమెరికా కలల మీద ఒక భారీ గోడలా మారింది. ఈ నిర్ణయం విద్యార్థుల కెరీర్, కుటుంబ ఆశలు, వివాహ సంస్కృతి, మానసిక స్థితి అన్నింటినీ ప్రభావితం చేస్తోంది. తెలుగు ప్రపంచం ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతోంది.. అదేంటంటే.. ఈ కల ఎప్పుడైనా మళ్లీ చేరుకోగలమా? అని. మరి ట్రంప్ సుంకాల దాడి ముందు ముందు ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications