విదేశీయుల టాలెంట్ మీదనే బండిని నెట్టుకొస్తున్న అమెరికా..షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు
అమెరికాలో టెక్ జాబ్స్ అని విన్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది H-1B వీసా. "బిగ్ టెక్ కంపెనీలు విదేశీయుల పైనే ఆధారపడుతున్నాయి" అన్న విమర్శలు తరచుగా వినిపిస్తాయి. కానీ అసలు హైరింగ్ ప్రాసెస్‌ని లోతుగా పరిశీలిస్తే వేరే కథ బయటపడుతుంది. కంపెనీలు ఉద్యోగిని ఎంచుకోవడానికి జాతీయత కాకుండా స్కిల్, టాలెంట్, ఇన్నోవేషన్‌పైనే దృష్టి పెడతాయి. దీని కారణంగానే అమెరికన్ యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీయులకే పెద్ద ఎత్తున అవకాశాలు దక్కుతున్నాయి.
అమెరికాలో కంప్యూటర్ సైన్స్ పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థుల్లో అమెరికన్లు చాలా తక్కువమంది ఉన్నారు. ఎక్కువ మంది భారతదేశం, చైనా నుంచి వచ్చే విద్యార్థులే. వీరు టాప్ యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేస్తూ అమెరికాకు ఇన్నోవేషన్‌లో సహాయం చేస్తున్నారు. కానీ, నిజం ఏంటంటే అమెరికా విద్యార్థులు అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ సైన్స్ చదవడంలో ఎక్కువ ఆసక్తి చూపడం లేదు.

ఈ విషయం గురించి టెక్ ఇన్వెస్టర్ దీడి దాస్ (@deedydas) తన "X" (Twitter) పోస్ట్‌లో చాలా క్లియర్‌గా చెప్పారు. అమెరికాలో CS పీహెచ్‌డీ చేస్తున్నవారిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు.
అమెరికాలో కంప్యూటర్ సైన్స్ (CS) చదువుతున్న విద్యార్థుల్లో చాలా మంది అమెరికన్‌లే కారు. ఉదాహరణకి, సుమారు 60% CS పీహెచ్‌డీ విద్యార్థులు విదేశీయులే. అలాగే, CS మాస్టర్స్ గ్రాడ్యుయేషన్లో కూడా 53% మంది ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులే ఉంటారు. అంటే, అమెరికాలో ఉన్న CS విద్యార్థులలో ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులే అని చెప్పొచ్చు. కానీ కంపెనీల వద్ద పరిస్థితి అలాగే ఉండదు. పెద్ద టెక్ కంపెనీలలో H-1B వీసా ఉద్యోగుల సంఖ్య 15% కంటే తక్కువే. అంటే, అమెరికాలో CS చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువ ఉన్నా, కంపెనీలు అంత ఎక్కువ H-1B ఉద్యోగులను నియమించడం లేదు.
అమెరికా టెక్నాలజీ రంగంలో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ వంటి రంగాల్లో ప్రపంచానికి లీడర్‌గా ఉండాలని ప్రయత్నిస్తోంది. కానీ ఈ రంగాల్లో అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ చేయడం, కొత్త టెక్నాలజీలు తయారు చేయడం కోసం ఎక్కువ మంది నిపుణులు విదేశీయులే ఉన్నారు. అంటే, అమెరికా కంపెనీలు టాప్ యూనివర్సిటీల్లో చదివి మంచి స్కిల్ సంపాదించిన ఇండియన్, చైనీస్ విద్యార్థులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. వీరు రీసెర్చ్, ఇన్నోవేషన్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, అమెరికాలో దేశీయ నిపుణుల సంఖ్య తక్కువగా ఉండటం సమస్యగా మారింది. ఈ కారణంగా, భవిష్యత్తులో అమెరికా టెక్ పరిశ్రమకు కావలసిన స్కిల్, నైపుణ్యాలను పూర్తి స్థాయిలో అందించడంలో ఒక లోపం రావచ్చు.

ఇక్కడే సమస్య మొదలవుతుంది. చదువు పూర్తయ్యాక, ఈ విద్యార్థులు అమెరికాలోనే ఉంటారా, లేక వీసా సమస్యల కారణంగా తమ దేశాలకు తిరిగి వెళ్తారా అన్న పరిస్థితి ఉంది. కొందరు అమెరికాలో స్టార్టప్‌లు ప్రారంభించి అవకాశాలను సృష్టిస్తారు, మరికొందరు తమ ప్రతిభను ఇతర దేశాలకు తీసుకెళ్తారు. చాలా సందర్భాల్లో, వీరు అమెరికాలో ఉండాలనుకున్నా ఇమిగ్రేషన్ రూల్స్ కారణంగా అది కష్టం అవుతుంది. ఫలితంగా, అమెరికా తానే శిక్షణ ఇచ్చిన ప్రతిభను కోల్పోతుంది.
ఇక అమెరికన్ స్టూడెంట్స్ విషయానికి వస్తే, చాలామంది బాచిలర్స్ తర్వాతే ఉద్యోగాల్లోకి వెళ్లిపోతారు. మాస్టర్స్, పీహెచ్‌డీ లాంటి అడ్వాన్స్‌డ్ లెవెల్ చదవడానికి అంతగా ముందుకు రావడం లేదు. దీని వలన హై-లెవెల్ టెక్ ఎక్స్‌పర్ట్స్‌లో అమెరికాకు సొంతంగా బలమైన పైప్‌లైన్ ఏర్పడటం లేదు. బిగ్ టెక్ నిజంగానే అమెరికన్లను పక్కన పెట్టిందా అన్న సందేహం కొందరికి ఉండొచ్చు. అయితే నిజం అది కాదు. గూగుల్, మెటా, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు ఉద్యోగులను ఎంచుకునేటప్పుడు జాతీయత చూడరు, వాళ్ళు ముఖ్యంగా చూసేది ఒకటే స్కిల్ మరియు టాలెంట్. అవి ఎవరిలో ఉంటె వారిని మాత్రమే హైర్ చూసుకుంటారు.
బిగ్ టెక్ కంపెనీలు ఎక్కువ మంది విదేశీయులను హైర్ చేసే కారణం సప్లై సమస్య. అంటే, అమెరికాలో పీహెచ్‌డీ లేదా మాస్టర్స్ పూర్తి చేసిన నిపుణుల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి "కంపెనీలు అమెరికన్లను పక్కన పెడుతున్నాయి" అని చెప్పడం తప్పు. నిజానికి, ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు అడ్వాన్స్‌డ్ CS చదివితే, వాళ్లకు కూడా బిగ్ టెక్ కంపెనీలలో సమాన అవకాశాలు ఉంటాయి.
డేటా చెబుతున్నది ఏంటంటే అమెరికా టెక్ ఇండస్ట్రీకి ఇంకా ఎక్కువగా విదేశీ ట్యాలెంట్ మీద ఆధారపడాల్సి ఉంది. అదే సమయంలో, అమెరికన్ విద్యార్థులు అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ సైన్స్‌లో చేరకపోతే, ఈ ఆధారపడటం ఇంకా ఎక్కువ అవుతుంది.


Click it and Unblock the Notifications