అమెరికాకు వెళ్లే ఉద్యోగులు కొత్త H-1B వీసాల కింద ఒక్కొక్క దరఖాస్తుకు భారీగా లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) రుసుము చెల్లించాలన్న ట్రంప్ పరిపాలన నిర్ణయం అమెరికాలో రాజకీయ-చట్టపరమైన వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాలిఫోర్నియా నేతృత్వంలో 20 రాష్ట్రాల సంకీర్ణం.. ట్రంప్ ప్రభుత్వంపై ఫెడరల్ కోర్టులో దావా దాఖలు చేసింది. ఈ చర్య అమెరికా వలస విధానం, కార్మిక మార్కెట్, నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో జాతీయ స్థాయిలో ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచిందని తెలుస్తోంది.
సెప్టెంబర్‌లో ప్రకటించిన ఈ విధానం ప్రకారం.. ఇప్పటివరకు సాధారణంగా 2 వేల డాలర్ల నుంచి నుంచి 5 వేల డాలర్ల మధ్య ఉండే H-1B వీసా రుసుమును అనూహ్యంగా లక్ష డాలర్లకి పెంచుతూ ట్రంప్ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం Trump పరిపాలనా మార్పు కాదని.. వాస్తవానికి విదేశీ నైపుణ్య కార్మికులను నిరుత్సాహపరిచే శిక్షాత్మక సర్‌ఛార్జ్ అని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.

ఈ వ్యాజ్యాన్ని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ముందుండి నడిపిస్తున్నారు. ఆయన ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ చట్టాలు కేంద్ర ప్రభుత్వానికి వీసా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన నిజమైన పరిపాలనా ఖర్చులను మాత్రమే వసూలు చేసే అధికారం ఇస్తాయి. అయితే ఆదాయం పెంచడం లేదా వీసా వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో భారీ రుసుములు విధించడం చట్టవిరుద్ధమని ఈ రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
ఈ అక్రమ లక్ష డాలర్ల H-1B రుసుము.. కాలిఫోర్నియా ప్రభుత్వ యజమానులు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ఇతర కీలక సేవా సంస్థలపై అనవసర ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఇది ఇప్పటికే ఉన్న కార్మిక కొరతను మరింత తీవ్రమయ్యేలా చేస్తుందని బోంటా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకంగా టెక్నాలజీ, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలు ఈ విధానం వల్ల తీవ్రంగా ప్రభావితమవుతాయని రాష్ట్రాలు పేర్కొన్నాయి.
ఈ నిర్ణయం భారతీయ నిపుణుల్లో కూడా ఆందోళన కలిగించింది. ఎందుకంటే H-1B వీసా హోల్డర్లలో గణనీయమైన వాటా భారతీయులదే. అమెరికాలోని అనేక టెక్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, ఆసుపత్రులు భారతీయ ఇంజినీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలపై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఈ వీసా కార్యక్రమం కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక ఉద్యోగాల కోసం విదేశీ నిపుణులను నియమించుకునే అవకాశాన్ని ఇస్తుంది.
సాధారణంగా అధిక డిమాండ్ కారణంగా H-1B వీసాలను లాటరీ విధానం ద్వారా కేటాయిస్తారు. ఈ ఏడాది అమెజాన్ 10 వేలకుపైగా వీసాలతో అతిపెద్ద గ్రహీతగా నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి సంస్థలు కూడా ప్రధాన వినియోగదారులుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా H-1B ఉద్యోగులకు కాలిఫోర్నియా అగ్ర గమ్యస్థానంగా ఉంది.
అయితే ట్రంప్ పరిపాలన ఈ విమర్శలను ఖండిస్తోంది. వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ మాట్లాడుతూ.. ఈ రుసుము పూర్తిగా చట్టబద్ధమని, H-1B కార్యక్రమంలో సంస్కరణలకు ఇది అవసరమైన తొలి అడుగని అన్నారు. విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యమని పరిపాలన వాదిస్తోంది. ఇదే సమయంలో, ట్రంప్ వ్యతిరేకులు మాత్రం ఈ విధానం అమెరికా పోటీతత్వం, ఆవిష్కరణ సామర్థ్యం, గ్లోబల్ టాలెంట్ ఆకర్షణను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా రాబోయే కోర్టు తీర్పు ఈ వివాదానికి కీలక మలుపుగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications