అమెరికాలోకి వలసలను నియంత్రించేందుకు ట్రంప్ సర్కారు మరింత కఠినమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో.. అక్కడ నివసిస్తున్న వలసదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా భారతీయ H-1B వీసా నిపుణుల్లో రోజు రోజుకు భయం, అనిశ్చితి పెరుగుతోంది. వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఇమ్మిగ్రేషన్ అధికారుల పరిశీలన పెరగడం వల్ల, చాలా మంది వలసదారులు దేశీయంగా అయినా, అంతర్జాతీయంగా అయినా ప్రయాణించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. యుఎస్ ని వదిలి వెళ్లేందుకు సాహసించడం లేదు.
న్యూయార్క్ టైమ్స్‌తో కలిసి కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF) నిర్వహించిన 2025 సర్వే ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల్లో సుమారు 27 శాతం మంది.. అంటే ప్రతి 10 మందిలో ముగ్గురు ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిని ఆకర్షించకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ప్రయాణాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడైంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నవారూ ఈ భయానికి లోనవుతున్నారు. చట్టబద్ధంగా అమెరికాలో ఉన్న H-1B వీసాదారుల్లో 32 శాతం మంది, సహజ పౌరుల్లో 15 శాతం మంది కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నట్లుగా సర్వే వెల్లడించింది. పత్రాలు లేని వలసదారుల్లో ఈ భయం మరింత తీవ్రంగా ఉంది. వారిలో దాదాపు 63 శాతం మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉన్నారని అంచనా.
ఈ పరిస్థితి అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే సెలవుల సీజన్ సమయంలో చోటుచేసుకోవడం గమనార్హం. సాధారణంగా థ్యాంక్స్‌గివింగ్ నుంచి క్రిస్మస్, నూతన సంవత్సర కాలంలో లక్షలాది మంది అమెరికన్లు ప్రయాణిస్తారు. కానీ ఈసారి అనేక మంది వలసదారులు ఇంటికే పరిమితమవుతున్నారు.
దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. డేటా షేరింగ్ పెరగడం అని చెప్పవచ్చు. రవాణా భద్రతా పరిపాలన (TSA) దేశీయ విమాన ప్రయాణికుల సమాచారాన్ని కూడా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)తో పంచుకుంటోందనే వార్తలు వలసదారుల్లో ఆందోళనను పెంచాయి. ఫెడరల్ ఏజెన్సీల మధ్య ఈ డేటా భాగస్వామ్యం అరెస్టులు, నిర్బంధాలు, బహిష్కరణలను సులభతరం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
KFF సీనియర్ సర్వే విశ్లేషకురాలు షానన్ షూమేకర్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ భయాల కారణంగా ఇప్పటికే చాలా మంది వలసదారులు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. TSA-ICE డేటా షేరింగ్ వార్తలతో ఈ పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని పేర్కొన్నారు.
ఈ భయం భారతీయ H-1B నిపుణుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. టెక్సాస్‌కు చెందిన 30 ఏళ్ల భారతీయ ఐటీ నిపుణురాలు శిఖా రెండు సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులను కలవడానికి భారత్ వెళ్లాలనుకున్నా.. వీసా పరిశీలన పెరిగిందన్న వార్తలతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. అవసరం లేకుండా రిస్క్ తీసుకోవద్దని మేము ఆమెకు చెప్పామని ఆమె తండ్రి తెలిపారు.
జూలై నుంచి H-1B కార్యక్రమంలో జరిగిన వరుస మార్పులు ఈ భయానికి మరింత కారణమయ్యాయి. రిమోట్ వీసా రిన్యూవల్స్ రద్దు, కొత్త దరఖాస్తులపై భారీ ఫీజులు, సోషల్ మీడియా స్క్రీనింగ్ వంటి చర్యలు వీసాదారుల్లో అయోమయాన్ని సృష్టించాయి. దీని ఫలితంగా కాన్సులేట్లలో ఇంటర్వ్యూలు భారీగా వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో..ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు, అలాగే మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద టెక్ కంపెనీలు కూడా H-1B వీసాదారులకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది భారతీయ వలసదారులు ఇప్పుడు ప్రయాణం కన్నా ఇంట్లో ఉండడమే సురక్షితమని భావిస్తున్నారు.
More From GoodReturns

అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!



Click it and Unblock the Notifications