రూ. లక్షా డెబ్భై వేలు జీతం.. నెలాఖరుకి జీరో బ్యాలన్స్.. భార్య కూడా ఉద్యోగం చేయాలంటున్న టెకీ..

కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాని ప్రభావం ఇప్పటికీ అందర్నీ వెంటాడుతోంది.. ఆర్థిక మాంద్యంలో అనేక కుటుంబాలు దినదిన గండంగా బతుకుతున్నాయి. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తే కాని బతకలేని పరిస్థితి నెలకొంది. ఉన్న ఊరు వదిలి నగరంలో బతికేవారికి ఇద్దరూ జాబ్ చేస్తే తప్ప నెల వచ్చేసరికి బతకలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. దీనిపై అనేకమంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చగా..తాజాగా గురుగ్రామ్ కు చెందిన ఓ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

గురుగ్రామ్‌లోని సైబర్ సిటీలో ఉన్న ఒక ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ (PayU) లో పనిచేస్తున్న 34 ఏళ్ల ఉద్యోగి తన ఆర్థిక ఇబ్బందులను, కుటుంబ భారాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన నేటి ఆర్థిక స్థితిగతులకు అద్దం పడుతోంది. పన్నులన్నీ పోను నెలకు రూ. 1.75 లక్షల వేతనాన్ని ఇంటికి తీసుకువస్తున్నప్పటికీ.. నెలాఖరు వచ్చేసరికి చేతిలో కేవలం రూ. 15 వేలు మాత్రమే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నిత్యావసరాలు, కుటుంబ బాధ్యతల వల్లే తన ఆదాయంలో మెజారిటీ భాగం ఖర్చవుతోందని టెకీ వివరించాడు.

Gurgaon Techie Viral Post Wife Ambition Career Goals Techie News Social Media Debate Marriage Career Aspirations Gurgaon News India News Viral News Relationship Discussion

తన నెలవారీ ఖర్చుల వివరాలను చెబుతూ.. సెక్టార్ 56 లోని 2BHK అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ. 40 వేలు అద్దె చెల్లిస్తుండగా, కరెంట్, గ్యాస్ వంటి యుటిలిటీలు, కిరాణా సామాగ్రి కోసం రూ. 30 వేలు ఖర్చవుతోందన్నాడు. వీటితో పాటు కారు ఈఎంఐ (EMI) రూపంలో రూ. 16 వేలు, రాంచీలో ఉంటున్న తన తల్లిదండ్రుల అవసరాల కోసం ప్రతి నెలా పంపే రూ. 20 వేలు, తన కుమార్తె పాఠశాల ఫీజులు, వైద్య ఖర్చులు, హాబీలు, బట్టలు తదితర నిత్యావసరాల కోసం ఏకంగా రూ. 50 వేలు ఖర్చవుతున్నట్లు తెలిపాడు.

ఈ ఆర్థిక ఒత్తిడికి గల ప్రధాన కారణాన్ని ప్రస్తావిస్తూ.. తన భార్య నిషా తమ కుమార్తెను ఎంతో ప్రేమగా చూసుకునే మంచి తల్లి అయినప్పటికీ.. నాలుగేళ్ల క్రితం పెళ్లయినప్పటి నుంచి ఆమె ఉద్యోగం చేయకపోవడం పట్ల తాను తీవ్ర నిరాశకు గురవుతున్నానని తెలిపాడు. తాము కలుసుకున్న సమయంలో ఆమె ఎంబీఏ (MBA) చదువుతోందని..అయితే చదువు మధ్యలోనే ఆపేసిందని చెప్పాడు. ఇప్పుడు తిరిగి తన కెరీర్‌ను ప్రారంభించడానికి.. ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి లేదా ఇంటి నుండి చిన్న వ్యాపారమైనా మొదలుపెట్టడానికి ఆమె పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఆవేదన చెందాడు.

Also Read

తాను భార్యను కించపరచడానికి ఈ మాటలు చెప్పడం లేదని.. కుటుంబానికి తానే ఏకైక పోషకుడిగా ఉండటం వల్ల వస్తున్న ఒత్తిడితోనే ఈ ఆలోచనలు కలుగుతున్నాయని స్పష్టం చేశాడు. తన చుట్టూ ఇద్దరూ సంపాదించే జంటలను చూసినప్పుడు.. తన భాగస్వామికి కూడా కెరీర్ ఆశయాలు ఉండి ఉంటే జీవితం మరింత సులభంగా ఉండేదేమో అనిపిస్తోందని పేర్కొన్నాడు.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వినియోగదారులు టెకీ ఆవేదనను తప్పుబడుతూ.. ఒకవేళ ఆమె ఉద్యోగానికి వెళ్తే.. ఆ తర్వాత సంభాషణ అంతా ఆమె మన కూతురిని సరిగ్గా చూసుకోవడం లేదనేదానికి మారిపోతుందని వ్యాఖ్యానించారు. మరికొందరు అతని ఖర్చుల తీరును విమర్శిస్తూ.. నాలుగేళ్ల చిన్నారి ఖర్చుల కోసమే నెలకు రూ. 50 వేలు కేటాయించడం చాలా ఎక్కువని.. అతను తన ఆదాయానికి మించి విలాసవంతంగా ఖర్చు చేస్తున్నాడని వేలెత్తి చూపారు.

అదే సమయంలో కొంతమంది నెటిజన్లు ఆ కుటుంబానికి ప్రాక్టికల్ సలహాలు ఇచ్చారు. ఖర్చులు తగ్గించుకోవడానికి 2BHK నుండి 1BHK ఇంటికి మారవచ్చని.. మెట్రో నగరాల్లో కారు అవసరం లేకపోతే దానిని వదిలించుకోవచ్చని సూచించారు. ఆర్థికంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటే.. కనీసం ఇంట్లో వంట మనుషులను పెట్టకుండా వంట బాధ్యతలను భార్యే చూసుకునేలా ఒప్పించాలన్నారు. బిడ్డను తక్కువ ఫీజులున్న సాధారణ పాఠశాలలో చేర్పించాలంటూ సలహా ఇచ్చారు. భార్య ఇంట్లోనే ఉంటూ బిడ్డ చదువుల బాధ్యతను చూసుకోవడం ద్వారా కూడా ఒక గృహిణిగా అనేక విధాలుగా కుటుంబానికి తోడ్పడుతూ డబ్బు ఆదా చేయవచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+