గుర్గావ్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన ఓ ఇంటి నివాసి వైభవ్ జె. తన హై లెవెల్ లైఫ్ స్టయిల్ కోసం ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను వివరిస్తూ లింక్డ్‌ఇన్‌లో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన 3 కోట్ల ఇంటిని ఉదాహరణగా చెప్తూ "ఊపిరి పీల్చుకోవడానికి నెలకు 7.5 లక్షలు కావాలి" అంటూ ఆయన చేసిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తోంది. వైభవ్ ప్రతినెల ఖర్చుల వివరాలను స్పష్టంగా వెల్లడించారు, ఇవి లగ్జరీ లైఫ్ గురించి మరో కోణాన్ని ఆవిష్కరించాయి.

అతని ప్రతినెల ఖర్చుల వివరాలు చూస్తే :
* 3 కోట్ల ఇంటికి EMI: రూ.2.08 లక్షలు
* ఫౌంటెన్ నిర్వహణ: నెలకు రూ.12,000
* కారు EMI: రూ.60,000
* పిల్లల స్కూల్ ఫీజు: నెలకు రూ. 65,000
*'విదేశీ పర్యటన కోసం': నెలకు రూ.30,000
* ఇంటి సిబ్బంది (వంట మనిషి, పనిమనిషి, డ్రైవర్): నెలకు రూ.30,000
* క్లబ్ నైట్‌లు, డిన్నర్‌లు (ఆనందించనివి): రూ.20,000
*'DLF ఫేజ్ 5 రెడీ'కి గ్రూమింగ్, డ్రెస్సింగ్: రూ.12,000
* ఇతర కొనుగోళ్లు: రూ.10,000 కంటే ఎక్కువ
* పుట్టినరోజు బహుమతులు, వివాహ ఎన్వలప్‌లు ('నకిలీ చిరునవ్వుల పన్ను'): రూ.15,000
* ఈ ఖర్చులన్నీ కలిపి నెలకు రూ. 5 లక్షలు అవుతాయని వైభవ్ పేర్కొన్నారు. దీనికి 30 శాతం ఆదాయపు పన్నును కలుపుకుంటే, నెలకు రూ. 5 లక్షలు ఖర్చు చేయడానికి రూ.7.5 లక్షలు (రూ.90 లక్షలు/సంవత్సరానికి పన్నుకు ముందు) సంపాదించాలని ఆయన వివరించారు.
పోస్ట్‌పై చర్చ: ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. కొందరు వైభవ్ అభిప్రాయంతో ఏకీభవించగా, మరికొందరు హాస్యంగా, ఇంకొందరు విమర్శలతో స్పందించారు. ఒక యూజర్ " ఫిక్స్డ్ ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను కేవలం 30 శాతం మాత్రమే కాదు. సర్‌ఛార్జ్ ఉంది, కాబట్టి ఇది మీ ఆదాయంలో మూడింట ఒక వంతు. ఈ లైఫ్ స్టయిల్ కొనసాగించడానికి మీకు కనీసం రూ.1.2 కోట్ల CTC అవసరం," అని అన్నారు.
మరొకరు, "గుర్గావ్ రియల్ ఎస్టేట్ అనేది అనవసరమైన హైప్, దీనిని ప్రజలు ఏదో ఒక విధంగా కొనుగోలు చేస్తున్నారు. కానీ అది ఏదైనా, గుర్గావ్ మే వైబ్ హై - ఈ వాతావరణం, AQI తప్ప," అని కామెంట్ చేసారు. పదేళ్ల క్రితం పరిస్థితిని గుర్తుచేసుకుంటూ, మరొకరు, "ఒక దశాబ్దం క్రితం, నేను JMD ఆర్కేడ్ సమీపంలోని DLF ఫేజ్ 2లో ఉన్నాను, తరువాత అమెక్స్ సమీపంలోని ఫేజ్ 5కి మారాను. అప్పట్లో వస్తువులు అంత ఖరీదైనవి కావు," అని తెలిపారు.


Click it and Unblock the Notifications