Highest Salary: పెద్ద కంపెనీలు కేవలం వ్యాపార నైపుణ్యాలు మాత్రమే కాక.. విశ్వాసం, విధేయత కలిగిన వ్యక్తులు ఉండటం వల్ల నిర్మించబడతాయి. అలా కంపెనీ స్థాపకులతో పాటు వారూ ముందుకు సాగుతుంటారు.
ప్రస్తుతం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ప్రసిద్ది చెందిన వ్యక్తి PMS ప్రసాద్ (పాండా మధుసూదన శివ ప్రసాద్). ఈయన కంపెనీ చాలా కాలం నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరు. అలాగే అంబానీకి అత్యంత విశ్వసనీయ డిప్యూటీలలో ఒకరు.

ఇంజనీరింగా పూర్తి చేసిన PMS ప్రసాద్ రిలయన్స్ వ్యవస్థాపకుడు, దిగ్గజ వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ వ్యాపారాలను నిర్వహిస్తున్న సమయంలో గ్రూప్‌లో చేరారు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు. ప్రసాద్ రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ CEOతో సహా గ్రూప్‌లో మెుత్తంగా 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రసాద్‌ను సీఈవోగా ముఖేష్ అంబానీ ప్రమోట్ చేశారు.
గుజరాత్ జామ్‌నగర్‌లో గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ పెట్రోలియం రిఫైనరీని నెలకొల్పే బాధ్యతను అంబానీ ప్రసాద్ కు అప్పగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని స్థాపించిన బృందానికి ప్రసాద్ నాయకత్వం వహించారు. రిలయన్స్ జియో విజయవంతమైన, మార్కెట్ ఆధిపత్య రోల్ అవుట్‌లో కూడా ప్రసాద్ కీలకంగా వ్యవహరించారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల జాబితాలో ప్రసాద్ కూడా ఉన్నారు. 2009 నుంచి ఆయన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ప్రసాద్ నెట్‌వర్క్18 మీడియా & ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, TV 18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్, రిలయన్స్ BP మొబిలిటీ లిమిటెడ్, వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ డీలర్స్ లిమిటెడ్‌తో సహా పలు అంబానీ వ్యాపారాలకు డైరెక్టర్‌గా ఉన్నారు. RIL వార్షిక నివేదిక 2021-22 ప్రకారం ప్రసాద్ మొత్తం రూ.11.89 కోట్ల వేతనంతో అత్యధికంగా చెల్లించే కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మూడవ స్థానంలో ఉన్నారు. జీతం, అలవెన్సుల పరంగా అత్యధికంగా చెల్లించే ఉద్యోగి ప్రసాద్ అని గమనించాలి


Click it and Unblock the Notifications