Katrina Kaif: షుగర్ ప్రీ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బ్యూటీ

అహ్మదాబాద్: జైడస్ క్యాడిలా.. కొంతకాలంగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోన్న టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ పేరు. గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను సాగిస్తోన్న ఈ కంపెనీ..ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఆ వ్యాక్సిన్ పేరు జైకోవీ-డీ. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్‌‌ను వినియోగించుకోవడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిఫారసు కూడా చేసింది.

జైడస్ వెల్‌నెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా

జైడస్ వెల్‌నెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా

ఇదే గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన జైడస్ వెల్‌నెస్ కొత్తగా షుగర్ ఫ్రీ కంటెంట్ ఉన్న అతి తక్కువ క్యాలరీలు గల స్వీటనర్‌ను తయారు చేసింది. ఈ ప్రొడక్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మార్కెటింగ్ బేసిక్ స్ట్రాటజీని అనుసరించింది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. షుగర్ ఫ్రీ కంటెంట్ ఉన్న ఈ ప్రొడక్ట్‌‌కు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్స్‌లో ఇక కత్రినా కైఫ్ కనువిందు చేస్తారు.

పాపులర్ సెలెబ్రిటీ..

పాపులర్ సెలెబ్రిటీ..

దేశ ప్రజలందరికీ బాగా తెలిసిన సెలెబ్రిటీలను తమ ప్రొడక్ట్స్‌ను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి తయారీ, ఉత్పాదక కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే ఆనవాయితీని కొనసాగించింది.. జైడస్ వెల్‌నెస్. బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కత్రినా కైఫ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. మార్కెట్‌లో తమ పొజీషన్ మరింత బలపరచుకోవడానికి కత్రినా కైఫ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు జైడస్ వెల్‌నెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ డైరెక్టర్ తరుణ్ అరోరా తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కు

హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కు

కత్రినా కైఫ్‌కు ఈ అవకాశాన్ని ఇవ్వడానికి గల కారణాలను కూడా తరుణ్ అరోరా వివరించారు. హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కు కత్రినా కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారని చెప్పారు. ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కల్పించడానికి ఆమెకు ఉన్న పాపులారిటీని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ మేరకు ఆమెతో ఓ కాంట్రాక్ట్‌ను కుదుర్చుకున్నామని చెప్పారు. ఆమెకు ఉన్న పాపులారిటీ.. తమ ప్రొడక్ట్‌ను మరింత సులభంగా జనంలోకి తీసుకెళ్లగలదని అన్నారు.

20 దేశాలకు పైగా..

20 దేశాలకు పైగా..

ఈ కాంట్రాక్ట్ ప్రకారం.. కత్రినా కైఫ్ జైడస్ వెల్‌నెస్ పేరెంట్ బ్రాండ్ షుగర్ ఫ్రీ, దానికి అనుబంధంగా తయారయ్యే షుగర్ ఫ్రీ డిలైట్ చాకొలెట్స్‌పై చిత్రీకరించే అడ్వర్టయిజ్‌మెంట్లల్లో నటించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జైడస్ వెల్‌నెస్‌కు నాలుగున్నర లక్షలకు పైగా అవుట్‌లెట్స్ ఉన్నాయి. కాంప్లాన్, ఎవర్‌యూత్, నైసిల్, గ్లూకోన్-డీ, షుగర్ లైట్, న్యూట్రాలైట్ వంటి బ్రాండ్స్ జైడస్ వెల్‌నెస్‌కు చెందినవే. అహ్మదాబాద్, ముంబై ప్రధాన కేంద్రాలుగా 20 దేశాలకు పైగా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించిందీ కంపెనీ.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+