Bonus Shares: ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఒక్క షేరుంటే 5 షేర్లు ఉచితం, రెండు రోజులుగా అప్పర్ సర్కూట్లో స్టాక్..
Gujarat Toolroom Shares: కొత్త ఏడాది పైగా త్వరలోనే దేశంలోని లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు తమ మూడవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించటానికి సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది డివిడెండ్, బోనస్ షేర్లు అందించే కంపెనీలపై బెట్టింగ్ వేసి మంచి దీర్ఘకాలిక రాబడులను అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరం మంచి ర్యాలీని ప్రారంభించిన వేళ ఇన్వెస్టర్లు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గుజరాత్ టూల్‌రూమ్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. కొత్త ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ షేర్లు పుంజుకున్నాయి. నేడు సైతం ఇంట్రాడేలో స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.18.08ని చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ షేర్లు ప్రధానంగా ఫోకస్ లో కొనసాగటానికి కారణం కంపెనీ బోనస్ షేర్ల గురించి చేసిన ప్రకటనే. ఈ క్రమంలో కంపెనీ అర్హులైన పెట్టుబడిదారులకు 5:1 నిష్పత్తిలో ఉచితంగా బోనస్ షేర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంటే దీని ప్రకారం కంపెనీలో ప్రస్తుతం ఒక్కో షేరు కలిగి ఉన్నందుకు అదనంగా 5 షేర్లు ఉచితంగా అందించబడతాయి. దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్లను సొంతం చేసుకోవటానికి పెట్టుబడిదారుల నుంచి రష్ మెుదలైంది.

కంపెనీ ఉచిత షేర్లను అందించటం కోసం జనవరి 6, 2025న జరిగే సమావేశంలో బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడైంది. అయితే దీనికోసం రికార్డు తేదీని కంపెనీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఒక్కసారి రికార్డు తేదీ ప్రకటించిన తర్వాత కంపెనీ బుక్స్ ప్రకారం ఆ డేట్ నాటికి షేర్లను హోల్డ్ చేసే పెట్టుబడిదారులకు మాత్రమే ఉచిత షేర్లు అందించబడతాయని గుర్తుంచుకోవాలి. అందుకే ఇన్వెస్టర్లు ఇప్పటి నుంచే కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆత్రంగా ఉన్నారు. చివరిసారిగా కంపెనీ తన షేర్లను మార్చి 2023లో షేర్లను విభజించిన సంగతి తెలిసిందే.
దీర్ఘకాలికంగా కంపెనీ షేర్లను నమ్ముకుని హోల్డ్ చేస్తున్న పెట్టుబడిదారులు ఇప్పటికే మల్టీబ్యాగర్ రాబడులను అందుకున్నారు. ఐదేళ్ల కాలంలో కంపెనీ షేర్లు 4600 శాతం రాబడిని అందించగా.. 3 ఏళ్ల కాలంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు 1485 శాతం రాబడిని అందించింది. అలాగే గడచిన ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 50 శాతానికి పైగా రాబడిని అందించింది. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.45.97గా ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.10.75 వద్ద కొనసాగుతోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications