Pharma Multibagger: లక్షను రూ.23 లక్షలు చేసిన స్టాక్.. ఈ ఫార్మా స్టాక్ మీ దగ్గర ఉందా..?
Multibagger Stock: ఎవరికైనా మంచి లాభాలు కావాలంటే తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలిక వ్యూహం తప్పనిసరి. ఇది చాలా మంది దిగ్గజ ఇన్వెస్టర్లు అనుభవపూర్వకంగా చెప్పింది. డబ్బులెవరికీ ఊరికే రావు బాసు.. అందుకు స్టాక్ మార్కెట్లలో చాలా ఓపిక కావాలి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ఒక ఫార్మా కంపెనీ గురించి. గుజరాత్ థెమిస్ బయోసిన్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది. నాలుగేళ్లలో పెట్టుబడిదారులకు ఏకంగా 2200 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.34 నుంచి రూ.780 స్థాయికి చేరుకుంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.921.05 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.376.10గా ఉంది.

దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను గుజరాత్ థెమిస్ బయోసిన్ షేర్లలో కొనసాగించిన ఇన్వెస్టర్లు ఊహించని లాభాలను అందుకున్నారు. నాలుగేళ్ల కిందట స్టాక్ ధర బీఎస్ఈలో ఆగస్టు 23, 2019న రూ.34 వద్ద ఉండగా.. ప్రస్తుతం మే 23, 2023న స్టాక్ ధర రూ.786.45 వద్ద ఉంది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారు సంపద విలువ రూ.23.13 లక్షలకు చేరుకుని ఉండేది.
అలాగే స్టాక్ గత రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 205 శాతం రాబడిని అందించింది. 28 మే 2021 నాటికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో కంపెనీ షేర్లు రూ.257.60 వద్ద ఉన్నాయి. మే 23, 2023న BSEలో కంపెనీ షేర్లు రూ.786.45 వద్ద ముగిశాయి. ఒక వ్యక్తి మే 28, 2021న కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి షేర్లను విక్రయించకుండా ఉంటే ప్రస్తుతం ఈ డబ్బు రూ.3.05 లక్షలుగా ఉండేది.జనవరి-మార్చి 2023 త్రైమాసికంలో గుజరాత్ థెమిస్ బయోసిన్ రూ.28.17 కోట్ల ఆదాయం, రూ.11.69 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications