గుజరాత్‌లో టాటా గ్రూప్ EV బ్యాటరీ ప్లాంట్.. ఆ దేశంలో ఏకంగా 9 వేల మందికి ఉపాధి
EV: గుజరాత్ ప్రభుత్వంతో టాటా గ్రూప్ ఓ భారీ ఒప్పందం చేసుకున్నట్లు రాయిటర్స్ నివేదించింది. దాదాపు 1.58 బిలియన్ డాలర్ల పెట్టుబడితో EV బ్యాటరీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపింది. ఇక్కడ లిథియం-అయాన్ ఆధారిత సెల్ ఫ్యాక్టరీని నిర్మించడానికి వ్యూహాత్మకంగా ప్లాన్ చేసినట్లు చెప్పింది.
జనాభాతో పోలిస్తే ఇండియాలో కార్ల మార్కెట్ చాలా చిన్నది. గతేడాది మొత్తం కార్ల అమ్మకాల్లో EV వాటా కేవలం 1 శాతం మాత్రమే అంటే 3.8 మిలియన్లు. దేశం తన సొంత ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసును సృష్టించే ప్రయత్నాల్లో ఇదొక ముందడుగుగా భావిస్తున్నారు. "గుజరాత్ సహా ఇండియాలో EV పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ఈ ప్లాంట్ చాలా దోహదపడుతుంది" అని గుజరాత్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది.

టాటా యూనిట్ అగ్రతాస్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ మరియు గుజరాత్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందంపై ఓ సంయుక్త ప్రకటన వెలువడింది. ఉత్తర గుజరాత్‌లోని సనంద్‌లో నిర్మించాల్సిన ఈ ప్లాంట్ పనులు అతిత్వరలో మూడు సంవత్సరాల్లోపే ప్రారంభం కానున్నట్లు తెలిపాయి. దీని ప్రారంభ ఉత్పాదక సామర్థ్యం 20 గిగావాట్ గంటలు (GWh) ఉంటుందని, రెండవ దశ విస్తరణలో మరింత రెట్టింపు చేయవచ్చని పేర్కొన్నాయి.
బ్రిటన్‌లో భారీ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ప్లాంట్‌ను ప్రారంభించాలని జాగ్వార్ ల్యాండ్ రోవర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. CEO లండన్ పర్యటనలో ఈ విషయం ఖరారు అవుతుందని భావిస్తున్నట్లు BBC నివేదిక పేర్కొంది. ఈ ప్రతిపాదిత ప్లాంట్ వల్ల నైరుతి ఇంగ్లాండ్‌లోని సోమర్‌సెట్‌లో 9 వేల మందికి ఉపాధి లభించనుంది. భారీ పెట్టుబడితో తమ దేశంలోకి కార్ల తయారీదారులను ఆకర్షించడం.. ఆ దేశ ప్రధాని రిషి సునక్‌కు పెద్ద విజయమనే చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications