IPO News: ఐపీవోకు రెడీ అవుతున్న గుజరాత్ కంపెనీ.. 22 దేశాల్లో వ్యాపారం..
IPO News: ఇప్పటికే మార్కెట్లో అనేక దశల్లో కంపెనీల ఐపీవోలు కొనసాగుతుండగా.. వీటికి తోడు మరికొన్ని కంపెనీలు వస్తున్నాయి. మార్కెట్లో లిస్ట్ అవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
తాజాగా గుజరాత్‌కు చెందిన స్పెషాలిటీ కెమికల్ కంపెనీ శివ్ ఫార్మాచెమ్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తోంది. కంపెనీ IPO ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావాలనుకుంటోంది. దీనికోసం మార్కెట్ రెగ్యులేటర్ SEBIకి అవసరమైన పత్రాలను సమర్పించింది.

కెమికల్స్ వ్యాపారంలో ఉన్న సంస్థ ఐపీవో ద్వారా రూ.900 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. వడోదరకు చెందిన శివ్ ఫార్మాకెమ్ DRHP ప్రకారం.. IPO పూర్తిగా ప్రమోటర్ గ్రూప్ వాటాదారుల వాటా విక్రయాన్ని కలిగి ఉంటుంది. అంటే కంపెనీ తన ప్రమోటర్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విక్రయించి డబ్బును సేకరిస్తోంది. విశాల్ రాకేష్ అగర్వాల్, రాహుల్ రాకేష్ అగర్వాల్ OFS లో పాల్గొంటారు. వీరిద్దరూ తమ వాటాల కింద రూ.383 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తారని వెల్లడైంది. కాగా గీతగంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.134 కోట్ల విలువైన షేర్లను విక్రయించాలని నిర్ణయించింది.
శివ ఫార్మాకెమ్ IPO ద్వారా సేకరించిన సొమ్ము వాటాలు విక్రయించిన వాటాదారులకు వెళ్తుంది. కంపెనీ ఎటువంటి నిధులను స్వీకరించదు. శివ ఫార్మాకెమ్ FY2023లో రూ.116.65 కోట్ల లాభాన్ని నివేదించింది. కంపెనీ ఆదాయం FY2023లో రూ.1,079.5 కోట్లకు పెరుగుతుందని అంచనా. FY23 నాటికి కంపెనీ 22 దేశాల్లో 181 బహుళజాతి, దేశీయ కంపెనీలకు సేవలను అందిస్తోంది. జర్మనీ, USA, స్విట్జర్లాండ్, ఇటలీ, మెక్సికోలు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్నాయి. కంపెనీకి గుజరాత్‌లోని లూనా, దహేజ్ సెజ్‌లలో మూడు.. హంగరీలో మూడు ఉత్పత్తి సౌకర్యాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications