అహ్మదాబాద్: పాల ఉత్పత్తిలో మరో సరికొత్త విప్లవం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి. అత్యధికంగా పాలను ఇచ్చే బన్నీ బ్రీడ్‌కు చెందిన గెదె.. ఐవీఎఫ్ విధానంలో దూడకు జన్మనిచ్చింది. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానంలో లేగదూడ జన్మించడం దేశంలో ఇదే తొలిసారి. ఈ బన్నీ బ్రీడ్‌కు చెందిన గేదెలు గుజరాత్‌లోని కఛ్ రీజియన్‌లో అత్యధికంగా కనిపిస్తుంటాయి. సమృద్ధిగా పాలను ఇచ్చే బన్నీ బ్రీడ్‌కు చెందినవి అవి.
ఐవీఎఫ్ విధానంలో టెస్ట్ ట్యూబ్ ద్వారా లేగదూడకు జన్మనిచ్చేలా చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ఫలితంగా- పాలను మరింత అధికంగా ఉత్పత్తి చేయడానికి ఈ ప్రయోగం బాటలు వేసినట్లు గుజరాత్ పశు సంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని ధనెజ్ గ్రామంలో ఓ రైతుకు చెందిన గేదె.. ఐవీఎఫ్ విధానంలో లేగదూడకు జన్మనిచ్చేలా అధికారులు ప్రయోగాలు చేశారు అది సక్సెస్ అయింది.

బన్నీ బ్రీడ్‌కు చెందిన మొత్తం ఆరు గేదెల్లో టెస్ట్ ట్యూబ్ విధానంలో దూడలకు జన్మనిచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో ఓ గేదె శనివారం దూడకు జన్మనిచ్చింది. సుశీల ఆగ్రోఫామ్స్‌లో పని చేసే వినయ్ ఎల్ వాలా అనే రైతుకు చెందిన గెదె అది. పాడి పరిశ్రమ రంగంలో ఉన్న కొన్ని సంస్థలు ఈ ప్రయోగానికి తమవంతు సహకారాన్ని అందించినట్లు పశుసంవర్దక శాఖ తెలిపింది. జేకే ట్రస్ట్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ జేకే బొవాజెనిక్స్, రేమాండ్ గ్రూప్ సాంకేతిక సహకారాన్ని ఇచ్చాయి.
మొత్తం ఆరు బన్నీ బ్రీడ్ గేదెల ద్వారా ఐవీఎఫ్ విధానంలో దూడలు జన్మించేలా ఏర్పాట్లు చేశాయి. అందులో ఒకటి ఈ సాయంత్రం ఈనింది. దీని ఫొటోలను పశు సంవర్ధక శాఖ అధికారులు విడుదల చేశారు. మరో వారం రోజుల్లో మిగిలిన అయిదు గేదెలు కూడా దూడలకు జన్మనిస్తాయని తెలిపారు. ఒక్కో బన్నీ బ్రీడ్ గేదె ఒక్కసారికే 12 నుంచి 18 లీటర్ల వరకు పాలు ఇస్తుందని, అలాంటివి తన వద్ద ఆరు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల ఈ బ్రీడ్ గెదెల సంఖ్య పెరుగుతుందని చెప్పారు.


Click it and Unblock the Notifications