Amul Milk: అమెరికాలో అమూల్ మిల్క్.. గుజరాతీ కంపెనీ బడా బిజినెస్ ప్లాన్..!!
Amul Milk in US: భారతదేశంలో ప్రముఖ డెయిరీ కంపెనీ అమూల్ వ్యాపార ప్రపంచంలో మరో విజయాన్ని సాధించింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన అమూల్ బ్రాండ్ కన్ను అగ్రరాజ్యంపై పడింది.
ప్రధాని మోదీకి చెందిన గుజరాత్ రాష్ట్రం కేంద్రంగా కంపెనీ పలు దశాబ్ధాలుగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం తన పాల వ్యాపారాన్ని అమెరికాకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ కంపెనీ అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ అండ్ మిడ్‌వెస్ట్ మార్కెట్‌లలో తాజా పాలను విక్రయించడానికి మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(MMPA)తో ఒప్పందం కుదుర్చుకుంది.

గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జాయెన్ మెహతా మాట్లాడుతూ.. అమూల్ తాజా పాల ఉత్పత్తిని అమెరికాలో విడుదల చేయనున్నట్టు తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలోని 108 ఏళ్ల చరిత్ర కలిగిన డెయిరీ కోఆపరేటివ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (MMPA) ఒప్పందం మార్చి 28న జరిగిన వార్షిక సమావేశంలో ప్రకటించబడింది.
అమూల్ సంస్థ అమెరికా మార్కెట్లో తన ఉత్పత్తులను విక్రయించటం ఇదే తొలిసారి. అమూల్ USలో అమూల్ బ్రాండ్ క్రింద ఒక గాలన్ (3.8 లీటర్), హాఫ్ గాలన్ (1.9 లీటర్) ప్యాక్‌లలో తాజా పాలను విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో 6 శాతం పాల కొవ్వుతో అమూల్ గోల్డ్, 4.5 శాతం పాల కొవ్వుతో అమూల్ శక్తి, 3 శాతం పాల కొవ్వుతో అమూల్ ఫ్రెష్, 2 శాతం పాల కొవ్వుతో అమూల్ స్లిమ్ ఉత్పత్తులు ఉన్నాయి. దేశీయ సంస్థ అమెరికా మార్కెట్లలో పాల వ్యాపారాన్ని విస్తరించటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications