GTL Infrastructure Shares: స్టాక్ మార్కెట్లో ప్రతిరోజూ కొన్ని స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు డబ్బుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. అయితే మంచి ఫండమెంటల్స్, భవిష్యత్తులో వ్యాపారం వృద్ధికి అవకాశాలు ఉండే షేర్లు చిన్నవైనా లేదా పెద్దవైనా తమ దూకుడును అవి కొనసాగిస్తూనే ఉన్నాయి. వీటిని గుర్తించటంలోనే అసలైన మజా ఉంటుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టెలికాం రంగంలో టవర్స్ వ్యాపారంలో ఉన్న GTL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. గడచిన కొన్ని సెషన్లలో కంపెనీ షేర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం మార్కెట్ల ముగింపు నాటికి స్టాక్ ధర 5 శాతం పెరిగి రూ.4.13కి చేరుకుంది. స్టాక్ కేవలం 20 ట్రేడింగ్ రోజుల్లో 150% పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్ 7న రూ.1.70 వద్ద ఉన్న ఒక్కో షేరు ధర ప్రస్తుతం రూ.4.13కి చేరుకుంది. అలాగే గడచిన 17 రోజులుగా స్టాక్ నిరంతరం 5% అప్పర్ సర్క్యూట్ తాకుతోంది.

కంపెనీ ఇన్వెస్టర్లను గమనిస్తే దేశీయంగా ఎల్‌ఐసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్ ఉండగా, కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లు సైతం డబ్బు పెట్టారు. బీఎస్ఈ స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.5,315.02 కోట్లుగా ఉంది. ఒక నెలలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు 178.52 శాతం రాబడిని అందించాయి. అలాగే గడచిన ఆరు నెలల కాలంలో 154.60 రాబడిని ఇన్వెస్టర్లు అందుకున్నారు. అలాగే ఏడాది కాలంలో 406.10 శాతం భారీ రాబడిని కంపెనీ తన పెట్టుబడిదారులకు అందించింది.
ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో జూలై 7, 2023న పెట్టుబడి పెట్టి ఉంటే అప్పుడు స్టాక్ ధర కేవలం ఒక్కోటి రూ.0.85 వద్ద ఉంది. అప్పుడు షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే అది ప్రస్తుతం రూ.5 లక్షలకు చేరుకుని ఉండేది. కంపెనీ పనితీరును గమనిస్తే 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ.214.75 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ నష్టం రూ.755.87 కోట్లుగా ఉంది. అలాగే మార్చి త్రైమాసికంలో అమ్మకాలు గత ఏడాది కంటే 12.38% తగ్గి రూ.331.09 కోట్లకు పడిపోయాయి. దీంతో మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం రూ.681.36 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications