For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST slab rationalisation: జీఎస్టీ రేట్ల మార్పు ఉండొచ్చు

|

ప్రస్తుతమున్న జీఎస్టీ స్లాబ్స్‌లో రెండింటిని విలీనం చేయడం ద్వారా ఈ నిర్మాణాన్ని మూడు స్లాబ్స్‌గా మార్చే అంశం పరిశీలనలో ఉందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా చీఫ్ ఎకనమిస్ట్ కేవీ సుబ్రమణియన్ జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ అంశంపై స్పందించారు. ఇది కచ్చితంగా జరుగుతుందన్నారు. మూడు రెట్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమని తెలిపారు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, వ్యాట్ వంటి డజనకు పైగా కేంద్ర, రాష్ట్ర సుంకాలను కలిపి జీఎస్టీని జూలై 201లో కేంద్రం అమలులోకి తీసుకు వచ్చింది.

ప్రస్తుతం జీఎస్టీలో 0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం స్లాబ్స్ ఉన్నాయి. రేట్ల హేతుబద్ధీకరణ ఉంటుందా అనే ప్రశ్నకు సుబ్రమణియన్ సమాధానం చెప్పారు. ముందుగా అనుకున్నది మూడు రేట్ల విధానమేనని, అందువల్ల కచ్చితంగా రేట్ల హేతుబద్ధీకరణ ఉంటుందని, ఇన్వర్టెడ్ సుంకాల విధానం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రభుత్వం కచ్చితంగా త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు.

GST slab rationalisation on cards

జూలైలో హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఆరు శాతం దిగువకు వస్తుందని, 5 శాతం పైన కొంతకాలం పాటు కొనసాగే అవకాశముందని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. మూడు త్రైమాసికాలుగా ఆర్బీఐ నిర్దేశించిన గరిష్ఠ లక్ష్యం కంటే అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవుతోంది.

English summary

GST slab rationalisation: జీఎస్టీ రేట్ల మార్పు ఉండొచ్చు | GST slab rationalisation on cards

The rationalization of the GST structure into three slabs by merging two existing slabs is on the cards, and progress should be seen soon, chief economic adviser in the finance ministry Krishnamurthy Subramanian said on Thursday.
Story first published: Friday, July 30, 2021, 20:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X