మీరు ఫుడ్ ఆర్డర్ చేసే ప్రతి సారి "డెలివరీ ఛార్జ్" కాస్త ఎక్కువగా కనిపిస్తుందా? ఇకపై అది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జీఎస్టీ కౌన్సిల్ క్లియర్‌గా చెప్పింది. ఇక్కడ నుంచి డెలివరీ ఫీజుపై కూడా 18% జీఎస్టీ వర్తిస్తుంది.
దీంతో దేశంలోని అగ్రగామి ఫుడ్ డెలివరీ కంపెనీలు అయిన జొమాటో, స్విగ్గీలకి సుమారు రూ.180-200 కోట్ల అదనపు పన్ను బారం పడనుందని అంచనా.

జీఎస్టీ రూల్‌లో ఏం కొత్తగా మారింది?
ఇంతవరకు డెలివరీ ఛార్జీలపై పన్ను ఎవరు భరించాలి? కంపెనీలా? లేక డెలివరీ పార్ట్‌నర్లా? అనే కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చింది. సెంట్రల్ జీఎస్టీ యాక్ట్ (సెక్షన్ 9(5))ప్రకారం, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు సర్వీస్ ప్రొవైడర్ల తరఫున పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. అంటే ఇక డెలివరీ ఫీజుపై జొమాటో, స్విగ్గీ నేరుగా పన్ను చెల్లించాలి.
ఇటీవల జొమాటో రూ. 451 కోట్లు, స్విగ్గీ రూ.192 కోట్ల లాభం ప్రకటించాయి. కానీ ఈ కొత్త ట్యాక్స్ డెసిషన్ వాళ్ల మార్జిన్స్ పై మళ్లీ ఒత్తిడి పెడుతోంది. ఇప్పటికే ఎక్కువ కస్టమర్లను ఆకట్టుకోవడానికి, డెలివరీ ఫీజులు మినహాయిస్తూ వచ్చిన ఈ కంపెనీలు ఇప్పుడు ఆ లూప్‌ని కొనసాగించగలవా అన్నది డౌట్.
జీఎస్టీ కొత్త రూల్ వల్ల వచ్చిన అదనపు పన్నును కంపెనీలు మేనేజ్ చేయడానికి రెండు మార్గాలు చూసే అవకాశం ఉంది. ఒకటి కొంత భాగాన్ని నేరుగా కస్టమర్ల పైనే వేయడం. అంటే ఫుడ్ ఆర్డర్ బిల్లులు పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది డెలివరీ పార్ట్‌నర్ల ఆదాయాన్ని తగ్గించడం. దీంతో వారు సంపాదించే మొత్తం తాత్కాలికంగా తగ్గిపోవచ్చు. మొత్తానికి, ఈ టాక్స్ బారం చివరికి కస్టమర్లకూ, డెలివరీ వర్కర్లకూ కొంతవరకు తాకే అవకాశం ఉంది. ఒక జొమాటో సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్లే డెలివరీ వర్కర్లకు వచ్చే ఆదాయం తగ్గే అవకాశం ఉంది.
కానీ అనలిస్ట్‌ల మాట ప్రకారం, బ్రోకరేజ్ హౌజ్‌లకి ఈ ప్రభావం అంతగా ఉండదని భావిస్తున్నాయి. ఎందుకంటే జొమాటోకు చెందిన బ్లింకిట్‌లో ఇప్పటికే డెలివరీ ఫీజుపై 18% జీఎస్టీ వసూలవుతోంది. అలాగే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఎక్కువ ఆర్డర్లకు డెలివరీ ఛార్జీలు మినహాయించబడుతున్నాయి. అదేకాకుండా, ఈ రెండు కంపెనీలు కూడా ప్లాట్‌ఫార్మ్ ఫీజులు పెంచుతూ ఆ ఖర్చును మేనేజ్ చేస్తున్నాయి. అంటే కస్టమర్లకు పెద్దగా షాక్ లేకుండా, ఈ అదనపు టాక్స్‌ని కంపెనీలు తమదైన స్ట్రాటజీతో బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఉదాహరణకు స్విగ్గీ ప్లాట్‌ఫార్మ్ ఫీ రూ.12 నుంచి రూ.15కి పెంచింది. జొమాటో రూ.11.8 నుంచి రూ.14.75కి పెంచింది.
జీఎం ఫైనాన్షియల్ అంచనాల ప్రకారం, FY27 నాటికి జొమాటో సుమారు 110 కోట్ల ఆర్డర్లు, స్విగ్గీ 80 కోట్ల ఆర్డర్లు డెలివర్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్లాట్‌ఫార్మ్ ఫీజులను పెంచడం ద్వారా జొమాటోకు సుమారు రూ.270 కోట్లు, స్విగ్గీకి రూ.200 కోట్లు అదనంగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అయితే, మినిమమ్ ఆర్డర్ విలువను తగ్గించడం వల్ల ఆ లాభాల్లో కొంత భాగం తగ్గిపోవచ్చని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
డెలివరీ ఛార్జీలు, ప్లాట్‌ఫార్మ్ ఫీజులు ఒక్కోసారి రూపాయి-రెండు రూపాయల చొప్పున పెరుగుతున్నా, కస్టమర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. రోజూ తాగే చాయ్‌కి ఎంత ఇస్తామో, అంతే సైలెంట్‌గా ఈ అదనపు ఖర్చులనూ భరిస్తున్నాం. అంతేకాదు, చిన్న చిన్న ఛార్జీలు పెరిగినా కూడా ఫుడ్ ఆర్డర్ చేయడాన్ని తగ్గించడం లేదు. ఈ హ్యాబిట్ చూసి కంపెనీలు మరింత కాన్ఫిడెంట్ గా మారుతున్నాయి. అనలిస్ట్‌లు దీనిని "డిమాండ్ ఇన్‌ఎలాస్టిక్" అంటున్నారు అంటే ఎంత ఖర్చు పెరిగినా మనం ఆర్డర్ చేస్తూనే ఉన్నాం. ఇదే జొమాటో, స్విగ్గీకి బిగ్ పాజిటివ్ సిగ్నల్. ఒక రకంగా చెప్పాలంటే, మన జేబులు బరువు తగ్గుతున్నా, మన ఫుడ్ క్రేవింగ్స్ మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications