GST News: జీఎస్టీ రికార్డు వసూళ్లు నమోదు.. అక్టోబరులో 13 శాతం పెరుగుదల..
GST News: దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వం గల్లా పెట్టే జీఎస్టీ డబ్బులతో నిండిపోయింది. గడచిన అక్టోబర్ నెలకు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి.
నవంబర్ మొదటి రోజున ఆర్థిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2023కి సంబంధించిన GST వసూళ్ల గణాంకాలను విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం మొత్తం వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి. ఇది రెండవ అతిపెద్ద రికార్డు వసూళ్లుగా తెలుస్తోంది. FY24 మొదటి అర్ధభాగంలో GST వసూళ్లు 11 శాతం పెరిగాయని పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ.9.92 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో GST వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ఇది ఒక సంవత్సరంలో నమోదైన అత్యధిక వృద్ధి కావటం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లకు చేరాయి.
అక్టోబర్ 2023లో జీఎస్టీ ద్వారా మొత్తం రూ.1,72,003 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సీజీఎస్టీ కింద రూ.30,062 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.38,171 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.91,315 కోట్లు వసూలయ్యాయి. అలాగే వస్తువుల దిగుమతిపై ఐజీఎస్టీలో రూ.42,127 కోట్లు వసూలయ్యాయి. దిగుమతులతో సహా దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం గతేడాది కంటే 13 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వసూళ్లు ఏప్రిల్‌లో నమోదయ్యాయి. మొత్తం వసూళ్లు అత్యధికంగా రూ.1.8 లక్షల కోట్ల మార్కును దాటాయి. గత నెల జీఎస్టీ వసూళ్లలో మెుదటి స్థానంలో గుజరాత్, రెండవ స్థానంలో కర్ణాటక నిలిచాయి.


Click it and Unblock the Notifications