GST లో 12 శాతం స్లాబ్ ఎత్తివేస్తే సామాన్యులు నష్టపోతారా..నిపుణులు ఏమంటున్నారంటే..

భారత్‌లో వస్తు & సేవల పన్ను (GST) 2017లో అమలు అయినప్పటి నుండి నాలుగు రకాలైన పన్ను స్లాబ్‌లు వేస్తున్న సంగతి విదితమే. వీటిలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28% శ్లాబ్స్ ఉన్నాయి. అయితే GST (Goods and Services Tax) కౌన్సిల్ 12 శాతం స్లాబ్‌ను పూర్తిగా రద్దు చేసి.. వస్తువులను 5 శాతం లేదా 18 శాతం స్లాబ్‌లలోకి మార్చే ప్రతిపాదనను పరిశీలిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వినియోగదారులకు ఇది తక్కువ పన్ను వస్తువులపై కొంత ఉపశమనంలా కనిపించినా కొన్ని వస్తువులు 18 శాతంలోకి వెళితే వినియోగదారుల జేబులుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

12 శాతం స్లాబ్ అనేది మధ్యతరగతి జీవులకు చాలా ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. మధ్యస్థ స్థాయి వస్తువుల ధరల కోసం ఒక సమతుల్య పన్ను రేటు ఇది. అయితే దీనిని పూర్తిగా రద్దు చేయడం వల్ల కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హోమ్ అప్లయెన్సెస్ (వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్), టైల్‌లు, సానిటరీ వేర్, ప్రాసెస్‌డ్ ఫుడ్ వంటి ఉత్పత్తులు 12 శాతం GST కింద ఉన్నాయి. ఇవి 5 శాతం లేదా 18 శాతం స్లాబ్‌లోకి వెళ్తే వినియోగదారుల ఖర్చు మారిపోతుంది. 12 శాతం శ్లాబ్ ఎత్తివేస్తే వచ్చే పరిణామాలపై సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ స్టాకిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ (SIDSA) జీ ఉపేందర్ గుడ్ రిటర్న్స్ కు ఇంటర్యూ ఇచ్చారు. వారి మాటల్లో..

GST Council 12 slab removal GST rate change GST items 5 18 GST reform GST consumer benefits GST tax revision India GST news GST expert opinions GST price impact 12 5 18 GST Council GST slab

12 శాతం GST శ్లాబ్ తొలగించడం వల్ల వినియోగదారులకు వచ్చే నష్టాలు ఏంటి
కొన్ని వస్తువులపై ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 శాతం GST ఉన్న కొన్ని వస్తువులు 18 శాతం స్లాబ్‌లోకి వెళితే వాటి ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు, టైల్స్, హోమ్ అప్లయెన్సెస్, కొన్ని ప్రాసెస్‌డ్ ఫుడ్ ఉత్పత్తులు. దీంతో పాటుగా వినియోగదారుల బడ్జెట్‌పై భారం తీవ్రంగా పడుతుంది.సాధారణంగా మధ్య తరగతి కుటుంబాలకు 12 శాతం GSTలో ఉన్న ప్రోడక్ట్స్ సాధారణంగా డే-టు-డే ఉపయోగం కోసం ఉంటాయి. ఇవి 18 శాతం కు మారితే బడ్జెట్‌లో అదనపు భారంగా మారే అవకాశం ఉంది.

12 శాతం స్లాబ్ అనేది ఎందుకు ముఖ్యమైనది ?
12 శాతం స్లాబ్ అనేది మధ్యస్థ ధర ఉన్న వస్తువుల కోసం ఒక బ్యాలెన్స్‌డ్ రేట్. దీన్ని తీసివేయడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే ఈ వస్తువులు అన్నీ 5 శాతంకి తగ్గించే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ వస్తువులు 18 శాతంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో వారి మీద భారం పడే అవకాశం ఉంది. ఇక 12 శాతం నుండి 18 శాతం కు వస్తువుల GST పెరిగితే మార్కెట్లో మొత్తం రిటైల్ ధరలు పెరిగి, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది.

SMEs (చిన్న,మధ్య తరహా వ్యాపారాలు)పై ప్రభావం ఉంటుందా ?
ఈ 12 శాతం స్లాబ్‌లో ఉన్న ఉత్పత్తుల్లో SMEs తయారు చేసినవే ఎక్కువగా ఉంటాయి. పన్ను పెరిగితే ఈ వ్యాపారాలు వినియోగదారుల డిమాండ్ తగ్గుతుందనే భయంతో లాభాలను కోల్పోయే ప్రమాదం ఉంది. తద్వారా చిన్న తరహా పరిశ్రమలు చాలా వరకు మూతపడే అవకాశాలు కూడా ఉంటాయి. జీవనోపాధి దెబ్బతింటుంది. ఉదాహరణకు 10 వేల విలువైన వస్తువు 12 శాతం GSTతో రూ. 11,200 అవుతుంది. అదే 18 శాతంకి వెళ్తే ఆ వస్తువు ధర రూ. 11,800 అవుతుంది.ఇది చాలా భారమే కదా.. పన్ను రేటు పెరిగితే వినియోగదారులు కొనుగోలు తగ్గిస్తారు. దాంతో చిన్న వ్యాపారాల అమ్మకాలు పడిపోతాయి.

మధ్య తరగతి కుటుంబాలపై ఎలాంటి భారం పడుతుంది ?
12 శాతం GSTలో ఉన్న ప్రోడక్ట్స్ సాధారణంగా వినియోగదారుల డే-టు-డే అవసరాలకు సంబంధించినవి అయి ఉంటాయి. ఇవి 18 శాతం GST లోకి వెళితే ఒక కుటుంబ బడ్జెట్‌పై మరింత భారం పెరుగుతుంది. టైల్‌లు, సానిటరీ వేర్ వంటి హోమ్ నిర్మాణ వస్తువులు ఖరీదవుతాయి. ఇళ్లు నిర్మించుకునే లేదా రిపేర్ చేసే మధ్య తరగతి కుటుంబాలపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

ద్రవ్యోల్బణం పరిస్థితి ఎలా ఉంటుంది ?
మధ్య స్లాబ్‌ను పూర్తిగా తొలగించి ఎక్కువ వస్తువులను 18 శాతంలోకి మార్చితే మార్కెట్‌లో ధరలు పెరుగుతాయి. 12 శాతం స్లాబ్ తొలగించి ఎక్కువ వస్తువులను 18 శాతం స్లాబ్‌లోకి మార్చడం వల్ల దేశంలో ధరల పెరుగుదల (ఇన్ఫ్లేషన్) మరింతగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో పెట్టేందుకు ఇది అనుకూలం కాదు. ప్రభుత్వం దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 12 శాతం స్లాబ్‌ను తొలగిస్తే ప్రభుత్వం కొంతకాలం అదనపు ఆదాయం పొందుతుంది. అయితే దీర్ఘకాలంలో ఇది చూసుకుంటే అంత మంచిది కాకపోవచ్చు.వినియోగదారుల ఖర్చు తగ్గడం వల్ల దీర్ఘకాలంలో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు.

GST Council 12 slab removal GST rate change GST items 5 18 GST reform GST consumer benefits GST tax revision India GST news GST expert opinions GST price impact 12 5 18 GST Council GST slab

South India Distributors and Stockists Association (SIDSA) Vice President G. Upender (Photo)

కొన్ని వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వస్తే లాభాలు ఏమైనా ఉన్నాయా ?
కొన్ని వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వెళ్తే వాటి ధరలు తగ్గుతాయి. ఉదాహరణకు ప్రాసెస్‌డ్ ఫుడ్, కొన్ని గృహోపకరణాలపై 5 శాతం పన్ను ఉంటే వినియోగదారులకు చౌకగా లభిస్తాయి. ఇది మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్‌కు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏ వస్తువులు ఏ శ్లాబ్ కిందకు వస్తాయో ప్రభుత్వం ముందు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. నిర్ణయం తీసుకునే ముందు సామాన్యుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నాం.

రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం ఉంటుందా ?
సమాధానం: రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావానికి వస్తే.. ఇంటి నిర్మాణ ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం సానిటరీ వేర్, టైల్‌లు, పెయింట్లు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ వంటి గృహ నిర్మాణ వస్తువులు 12 శాతం GST కింద ఉన్నాయి. వీటిని 18 శాతం స్లాబ్‌లోకి మార్చితే, ఇళ్లు నిర్మించే వ్యయం 5-6% వరకు పెరగవచ్చు. ఇక తక్కువ ఆదాయం గల కుటుంబాలు ఎక్కువగా అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై ఆధారపడతాయి. ఈ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల EMIలు, హౌస్ లోన్ బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. తద్వారా రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది.

ఆటోమొబైల్ రంగంపై ప్రభావం ఎంత ఉంటుంది ?
ఈ శ్లాబ్ ఎత్తివేస్తే.. స్పేర్ పార్ట్స్ ధరల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 12 శాతం GST కింద ఉన్న ఆటో పార్ట్స్ 18 శాతంకి వెళ్తే రిపేర్ ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా బైక్, కార్ల రిపేర్, సర్వీస్ ఖర్చులు వినియోగదారులకు భారమవుతాయి. తద్వారా కొనుగోలు డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం 12 శాతం స్లాబ్‌లో ఉన్న కొన్ని వాహన మోడళ్లు 18 శాతం GSTలోకి వెళ్తే కొత్త వాహనాల ధరలు పెరుగుతాయి. ఇది ఆటోమొబైల్ సేల్స్‌లో మందగమనానికి దారితీసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఎక్కువ EVలు 5 శాతం GST స్లాబ్‌లో ఉంటాయి కాబట్టి వీటిపై పెద్దగా ప్రభావం పెద్దగా ఉండదు.

FMCG రంగంపై ప్రభావం ?
ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రాసెస్‌డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ జ్యూస్, స్వీట్స్ వంటి ఉత్పత్తులు 12 శాతం GST కింద ఉన్నాయి. వీటిని 5 శాతంకి మార్చితే వినియోగదారులకు చౌకగా లభిస్తాయి. కానీ 18 శాతంకి వెళ్తే FMCG ధరలు భారీగా పెరుగుతాయి. FMCG ఉత్పత్తులు రోజువారీ అవసరాలకు చెందినవి. కాబట్టి ధరలు పెరిగితే వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్‌లో పడిపోతుంది. ఇక మరో విషయం ఏంటంటే.. అధిక GST వల్ల కంపెనీలు తమ మార్జిన్లను తగ్గించవలసి వస్తుంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా పడవచ్చు.

ప్రభుత్వం ఏం చేస్తే సామాన్యులకు బాగుంటుంది ?
12 శాతం స్లాబ్ తొలగించడం వల్ల ప్రభుత్వానికి GST రాబడి పెరిగినా, రియల్ ఎస్టేట్ మరియు SME రంగాలపై నేరుగా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రత్యేకించి హౌసింగ్ మరియు నిర్మాణ రంగాల్లో, అఫోర్డబుల్ హౌసింగ్ లక్ష్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. 12 శాతం స్లాబ్ ఉన్న కొన్ని అవసరమైన వస్తువులను 5 శాతంలో ఉంచడం ద్వారా వినియోగదారులకు ఉపశమనాన్ని ఇస్తే బాగుంటుంది.కాబట్టి ఈ మార్పు అమలు చేసేముందు ప్రభుత్వం పరిశ్రమలతో చర్చించి, వినియోగదారులకు భారం తక్కువగా ఉండేలా పన్ను నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం చాలా అవసరం. పరిశ్రమ సంఘాలు (CREDAI, CII, FICCI) సలహాలు తీసుకుని ముందుకు వెళితే బాగుంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+