GST News: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన దిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశం జూలై 11న జరిగింది. ఇందులో కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్లలో కేంద్రం మార్పులను ప్రకటించింది. మారిన రేట్లను పరిశీలిస్తే..
తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. క్యాన్సర్‌తో పోరాడే మందులు, అరుదైన వ్యాధులకు సంబంధించిన మందులను జీఎస్టీ పన్ను నుంచి మినహాయింపు లభించింది. అలాగే ప్రైవేట్ కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సౌకర్యాన్ని మినహాయింపు కిందకు తెచ్చారు. ఫిష్ సోలుబలే పేస్ట్, ఎల్‌డి స్లాగ్‌పై జీఎస్‌టీ రేటు 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించబడింది. సినిమా హాళ్లలో దొరికే ఆహారంపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. చివరిగా నూలుపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.

మల్టీ యుటిలిటీ వెహికల్స్(MUV)పై 22 శాతం సెస్ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలాగే ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై 28 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది.
ఆన్ లైన్ గేమింట్ వ్యాపారంపై జీఎస్టీని భారీగా పెంచటంతో ఆ రంగంలోని నజారా టెక్నాలజీస్, డెల్టా కార్ప్, జన్సర్ టెక్నాలజీస్, ఆన్ మెుబైల్ కంపెనీల షేర్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ప్రధానంగా డెల్టా కార్ప్ షేర్లు 25 శాతం మేర నష్టపోయి రూ.185.05 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే దీనివల్ల తమ ఆదాయాలపై ఎలాంటి ప్రభావం ఉండబోధని రాకేష్ జున్‌జున్‌వాలాకు చెందిన నజారా టెక్నాలజీస్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications