GST Evasion: దేశంలో జీఎస్టీ పన్ను విధాన్ని ప్రతిష్ఠాత్మకంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మెుదట్లో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ వెనక్కి తగ్గలేదు. తాజాగా పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం టెక్నాలజీని విరివిగా వినియోగిస్తోంది.
2023-24లో దాదాపు రూ.2.01 లక్షల కోట్ల పన్ను ఎగవేతను జీఎస్టీ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం జీఎస్టీ వసూళ్లలో దాదాపు 10 శాతానికి సమానమైనది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో GST ఎగవేత ఎన్నడూ లేనంత అత్యధికంగా అధికారులు గుర్తించారు. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగిన సంగతి తెలిసిందే.

జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా నమోదైన రంగాలను పరిశీలిస్తే.. ఆన్‌లైన్ గేమింగ్ అండ్ క్యాసినోలు రూ.83,588 కోట్లతో మెుదటి స్థానంలో నిలిచాయి. దీని తర్వాతి స్థానంలో కో-ఇన్సూరెన్స్/రీ-ఇన్స్యూరెన్స్ రూ.16,305 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం GST ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్(DGGI) కనుగొన్నారు. జీఎస్టీ పన్ను ఎగవేతకు సంబంధించి మొత్తం 6074 కేసులు నమోదు కాగా.. ఇందులో మెుత్తంగా రూ.2,01,931 కోట్లు పన్ను వసూలు కావాల్సి ఉందని వెల్లడైంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.20,713 కోట్ల స్వచ్ఛంద చెల్లింపులతో సహా రూ.1,01,354 కోట్లకు సంబంధించిన 4,872 జీఎస్‌టీ ఎగవేత కేసులు కనుగొనబడ్డాయి. వీటికి సంబంధించి 92 మందిని అధికారులు అరెస్టు చేశారు. పరోక్ష పన్ను విధానంలో.. మోసం, ఎగవేతలు, నకిలీ కంపెనీల రిజిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న అణిచివేత మధ్య .. బోగస్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లు GST అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టాక్స్ క్రెడిట్ మోసాలకు సంబంధించి 2,200 కేసులు నమోదయ్యాయి. FY24లో ప్రభుత్వ ఆదాయాన్ని కోల్పోకుండా ఉండేందుకు నకిలీ ITCకి వ్యతిరేకంగా DGGI ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications