GST News: ఈమధ్య కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పారిశ్రామిక వర్గాలైతే మరో అడుగు ముందుకేసి బాహాటంగానే విమర్శలు చేస్తున్నాయి. మొన్న లోకల్ రిజర్వేషన్‌పై అసెంబ్లీలో ప్రకటన తర్వాత పలు కంపెనీలు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు ఇన్ఫోసిస్ విషయంలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
GST ఎగవేతకు సంబంధించి దాదాపు 32 వేల 400 కోట్ల మేర ఇన్ఫోసిస్ పన్ను నోటీసు అందుకుంది. దీంతో సదరు కంపెనీతో పాటు పరిశ్రమల సమాఖ్య కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశంలోనే రెండో అతిపెద్ద IT సేవల సంస్థకు ఈ స్థాయిలో ట్యాక్స్ నోటీసులు ఇవ్వడాన్ని నాస్కామ్ సహా పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అయితే ఎట్టకేలకు అధికారులు యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక రాష్ట్ర GST అధికారులు ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన 'ప్రీ-షో కాజ్' నోటీసును ఉపసంహరించుకున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై DGGI (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్) సెంట్రల్ అథారిటీకి తమ ప్రతిస్పందన సమర్పించాలని సంస్థను ఆదేశించినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ మేరకు ట్యాక్స్ అధికారులకు సమాధానం ఇచ్చే ప్రక్రియలో ఉన్నట్లు IT సంస్థ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.
దేశీయ అపెక్స్ IT బాడీ నాస్కామ్ ఇన్ఫోసిస్‌ను సమర్థించింది. పరిశ్రమ ఆపరేటింగ్ మోడలపై ట్యాక్స్ విభాగానికి అవగాహన లేకపోవడాన్ని ఈ వ్యవహారం ప్రతిబింబిస్తుంది అని మండిపడింది. IT సేవల ఎగుమతి విషయంలో GST చెల్లింపులు క్రెడిట్ లేదా రీఫండ్‌కు అర్హమైనవి కావని కంపెనీ వాదిస్తోంది. తాము అన్ని GST బకాయిలను చెల్లించామని, ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు పూర్తి అనుగుణంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications