GST News: కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను(GST) విషయంలో కొత్త నిబంధనలను ప్రకటించింది. ప్రస్తుతం రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్(IRP)కి మే 1 నుంచి ఏడు రోజుల్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
టాక్స్ పేయర్లకు జీఎస్టీ నెట్ వర్క్ తాజాగా నిబంధనలను మార్చింది. దీని ప్రకారం పాత ఇన్‌వాయిస్‌లను.. ఈ-ఇన్‌వాయిస్ IRP పోర్టల్‌లలో పన్ను చెల్లింపుల కోసం అప్ లోడ్ చేసేందుకు కాల పరిమితి పెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ రూల్స్ రూ.100 కోట్లు లేదా అంత కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులకు వర్తించనున్నాయి.

సకాలంలో ఇన్‌వాయిస్‌లను రిపోర్టింగ్ చేసేందుకు 7 రోజులను గడువుగా జీఎస్టీఎన్ నిర్ణయించినట్లు ప్రకటించింది. అంటే ఏడు రోజులకంటే పాత ఇన్‌వాయిస్‌లను గడువు తర్వాత అప్ లోడ్ చేయటం ఇకపై కుదరదని వ్యాపారులు గుర్తుంచుకోవాలి. ఈ కొత్త ఫార్మాట్ మే 1, 2023 నుంచి అమలు చేయబడుతుంది. అయితే డెబిట్/క్రెడిట్ నోట్‌లను నివేదించడంలో సమయ పరిమితి ఉండదు.

ఉదాహరణకు ఏప్రిల్ 1, 2023కి చెందిన ఇన్‌వాయిస్‌ను 7 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 8, 2023 తర్వాత అప్ లోడ్ చేయటం ఇకపై కుదరదు. అందువల్ల పన్ను చెల్లింపుదారులు కొత్త సమయ పరిమితి ద్వారా అందించబడిన 7-రోజుల విండోలో ఇన్‌వాయిస్‌ను పోర్టల్ లో నివేదించినట్లు నిర్ధారించుకోవడం చాలా అవసరమని GSTN తెలిపింది. గడువులోపు అలా చేయకపోతే ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందటం కుదరదు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications