భారత ప్రభుత్వం ఇటీవల ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సిగరెట్లు, గుట్కా వంటి హానికర వస్తువుల వినియోగాన్ని తగ్గించడానికి 40 శాతం వస్తువులు, సేవల పన్ను (GST)ని ప్రవేశపెట్టింది. ఈ చర్య ప్రధానంగా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకువచ్చింది. జీవనశైలి వ్యాధులైన ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఈ కొత్త పన్ను అమల్లోకి తీసుకువచ్చింది.
కేంద్రం కొత్తగా ప్రకటించిన జీఎస్టీ మార్పుపై సూర్యతేజ నర్సింగ్ హోమ్ అధినేత, ప్రముఖ డాక్టర్ సత్యప్రసాద్ కేపీఎన్ గుడ్ రిటర్న్స్ తెలుగుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ GST పెంపు ప్రజారోగ్యంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అన్నారు. హానికర వస్తువుల వినియోగాన్ని తగ్గించడంలో ఈ నిర్ణయం ఓ మేర ప్రభావం చూపగలదన్నారు. చక్కెర, కార్బోనేటెడ్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌పై 40 శాతం GST Hike ప్రవేశపెట్టడం ద్వారా అనారోగ్యకరమైన ఎంపికలు ఖరీదైనవిగా మారతాయన్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

సూర్యతేజ నర్సింగ్ హోమ్ అధినేత, ప్రముఖ డాక్టర్ సత్యప్రసాద్ కేపీఎన్
ప్రపంచవ్యాప్తంగా కూడా పొగాకు, ఆల్కహాల్, చక్కెర వంటి హానికర ఉత్పత్తులపై పన్నులు వినియోగాన్ని తగ్గించడంలో సానుకూల ఫలితాలు చూపుతున్నాయన్నారు. భారతదేశంలో కూడా ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. వీటికి ప్రధాన కారణంగా అధిక చక్కెర, కెఫిన్ కలిగిన పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కేవలం ట్యాక్స్ విధానం మాత్రమే కాకుండా, భారతదేశంలోని జనాభా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ముఖ్యమైన ప్రజారోగ్య చర్యగా భావించవచ్చని తెలిపారు.
డాక్టర్ సత్యప్రసాద్ కేపీఎన్ మాటల్లో..
1. ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్‌పై 40 శాతం జీఎస్టీ పెంపు మధుమేహ వ్యాప్తిని తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది?
ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలు అధిక చక్కెర కలిగి ఉంటాయి. అధిక చక్కెర వినియోగం మధుమేహం, ఊబకాయం, హృదయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. 40 శాతం GST పెంపు ద్వారా ఈ పానీయాల ధర పెరుగుతుంది, అందువల్ల కొంతమంది వినియోగదారులు వాటిని తక్కువగా కొనుగోలు చేస్తారు. ఫలితంగా, చక్కెర అధికంగా తీసుకునే పరిస్థితి తగ్గుతుంది, మధుమేహ వ్యాప్తిని కొంతమేర తగ్గించగలదు. అయితే పూర్తి స్థాయిలో అరికట్టాలంటే అందుకు తగిన ప్రణాళికలు ఉండాలి.
2. ఈ పన్ను పెంపుతో ప్రజలు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంపిక చేసుకుంటారా.. మీరు సూచించే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉన్నాయా?
ఓ రకంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అధిక ధరతో అసౌకర్యం ఏర్పడితే ప్రజలు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అయితే దీనిపై అవగాహన అనేది చాలా అవసరం . Rates పెరిగితే మొదట్లో ప్రభావం ఉంటుంది. కొంతమేర వాడుక తగ్గుతుంది. అయితే ఆ తర్వాత ప్రభావం ఉండదు.సిగరెట్లమీద సుంకం 10 శాతం పెరిగితే 1 శాతం వాడుక తగ్గింది.

సూర్యతేజ నర్సింగ్ హోమ్ అధినేత, ప్రముఖ డాక్టర్ సత్యప్రసాద్ కేపీఎన్
అయితే black market పెరుగుతుంది. డాక్టర్లు అందరూ రోగులలో అవగాహన పెంచగలిగితే 10 శాతం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు విషయానికి వస్తే.. నార్మల్ నీరు లేదా ఫ్లేవర్డ్ వాటర్ (చక్కెర లేకుండా), పెరుగుతో చేసిన లస్సీ లేదా మిల్క్ బేస్డ్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్‌లు (తాజాగా తీయబడిన, చక్కెర తగ్గిన), గ్రీన్ టీ, Black Coffe, కొబ్బరి నీరు... లాంటివి వాడవచ్చు.
3. యువకులు, పిల్లలలో మధుమేహం నివారించడంలో ఈ జీఎస్టీ పెంపు ఎంతవరకు సమర్థవంతంగా ఉంటుందంటారు?
ప్రాథమికంగా చూసుకున్నట్లయితే యువకులు, పిల్లలు చక్కెర ఎక్కువగా ఉన్న డ్రింక్స్ కోసం తక్కువ డబ్బు ఖర్చు చేయలేరు. ఇది వారి వినియోగాన్ని తగ్గించి, అధిక బరువు, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలను పూర్తిగా కాకుండా కొంతమేర తగ్గించగలదు. అయినప్పటికీ, పూర్ణమైన పరిష్కారం కావాలంటే పౌర విద్య, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, సక్రమమైన డైట్ మార్గదర్శకాలు కూడా అవసరం. ఏదేమైనా వారిలో తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల తీసుకునే అవగాహన శ్రధ్ధ వల్లనే రోగాలు తగ్గుతాయి.ఈ పన్ను పెంపుల వల్ల 0.1 శాతం మాత్రమే తగ్గుతాయి
4. ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలు, సిగరెట్లపై 40 శాతం జీఎస్టీ పెంపు ప్రజారోగ్యంపై ఎంతవరకు ప్రభావాన్ని చూపుతుంది?
వినియోగం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ప్రజలు అలవాట్లను మార్చడం ప్రారంభిస్తారు, ఆరోగ్యకరమైన ఎంపికలకు వైపు వెళ్ళే అవకాశాలు 1 శాతం మేర ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉన్న ఊబకాయం, మధుమేహం, హృదయ వ్యాధుల రేటు కాస్త తగ్గే అవకాశం ఉంది. సిగరెట్లపై పన్ను కూడా పొగాకు వినియోగాన్ని తగ్గించి, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలను కొంతమేర తగ్గించగలదు.అయితే దీనికి అవగాహన అనేది చాలా అవసరం. లేకుంటే ఎంత తగ్గించినా వేస్ట్ గా మారే అవకాశం ఉంది.

5. ఈ పన్ను పెంపు వల్ల ప్రజలు ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు మారే అవకాశముందా?
ప్రోత్సాహకమైన పన్ను విధానం ప్రజలను ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు ప్రేరేపిస్తుందనుకోవడం అనేది పూర్తిగా చెప్పలేం. ముందు వారిలో అవగాహన రావాలి. వారిలో మార్పు రావాలి. అలా మార్పు వచ్చి యువతలో చక్కెర, కార్బోనేట్ పానీయాల వినియోగం తగ్గించగలిగితే.. మోటాపు, ఊబకాయం, మధుమేహం, హృద్రోగాల ప్రమాదం కొంతమేర తగ్గే అవకాశం ఉంది.
6. దేశంలో మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతూనే ఉన్న పరిస్థితిలో, ఈ పన్ను విధానం ఎంతవరకు సమర్థవంతం అవుతుందనుకుంటున్నారు?
GST పెరుగుదల అనేది కేవలం ఒక మార్గం మాత్రమే. దీర్ఘకాలికంగా సమర్థవంతం కావడానికి ఇది ఆరోగ్య అవగాహన, పౌర విద్య, పోషకాహారం, వ్యాయామం వంటి ఇతర ఆరోగ్య కార్యక్రమాలతో కలిపి అమలు చేయగలగాలి. పానీయాల ధర పెంపు 1 శాతం వరకే ప్రభావాన్ని చూపుతుంది, కానీ పూర్తి పరిష్కారం కోసం సంక్లిష్టమైన, సమగ్ర ప్రజారోగ్య వ్యూహం అనేది అత్యవసరం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications