For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST policy:అక్టోబర్ 1 నుండి జీఎస్టీ ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి

|

అక్టోబర్ 1వ తేదీ నుండి జీఎస్టీ ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ప్రకారం బిజినెస్ టు బిజినెస్ (B2B) ట్రాన్సాక్షన్స్ పైన వచ్చే నెల 1 నుండి ఈ-ఎన్కోడింగ్ తప్పనిసరి కానుంది. రూ.500 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి చేయవద్దని, స్వచ్చంధంగా ఉంచాలని ప్రభుత్వాన్ని పరిశ్రమ కోరుతోంది. అయితే చిన్న కంపెనీలకు ఈ-ఇన్వాయిస్ నుండి ఉపశమనం ఉంటుంది.

తొలిసారి హెటెరో ఫెవిపిరవిర్ 800ఎంజీ ట్యాబ్లెట్, ధర రూ.2,640తొలిసారి హెటెరో ఫెవిపిరవిర్ 800ఎంజీ ట్యాబ్లెట్, ధర రూ.2,640

ఇదివరకు రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థలకు ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి చేసే ప్రణాళిక తీసుకు రావాలని భావించారు. కనీస వార్షిక టర్నోవర్ పరిమితి రూ.500 కోట్లకు పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ సాధికార కమిటీ సూచించింది. ఈ-ఇన్వాయిస్ పన్ను సమ్మతిని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి జీఎస్టీ ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి చేసే ప్రణాళిక ఉంది. దీని కోసం సవరించిన తేదీగా అక్టోబర్ 1 అని కేంద్రం తెలిపింది.

 GST e invoicing mandatory for B2B transactions from October

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్ వర్క్ వెబ్ సైట్ ప్రకారం ఈ-ఇన్వాయిస్ వల్ల కంపెనీలకు ప్రయోజనాలు ఉంటాయి. ప్రామాణీకరణ, ఇంటర్ ఆపెరాబిలిటీ, జీఎస్టీ రిటర్న్స్, వివాదాల తగ్గింపు, చెల్లింపు చక్రాన్ని మెరుపురగచడం వంటివి ఉన్నాయి. అందుకే ఈ-ఇన్వాయిస్ విధాన సంస్థల సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుందని భావిస్తున్నారు.

English summary

GST policy:అక్టోబర్ 1 నుండి జీఎస్టీ ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి | GST e invoicing mandatory for B2B transactions from October

No further relaxation is likely in terms of e-invoicing as the Centre is set to go ahead with the decision to make GST e-invoicing mandatory for companies with an annual turnover of over Rs 500 crore for their business-to-business transactions starting October 1.
Story first published: Sunday, September 27, 2020, 10:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X