Banking News: ఏడాది చివరన దిగ్గజ బ్యాంకులకు గట్టి షాక్.. కోట్ల భారంతో కొత్త సంవత్సరంలోకి..

GST Notices: దేశీయ పన్నుల వసూళ్లు వేగం పుంజుకున్నాయి. ఆదాయపు పన్ను శాఖ AI వినియోగం కాసులు కురిపిస్తుండగా.. అటు GST అధికారులు సైతం ఏమాత్రం వెనకకు తగ్గకుండా రావాల్సిన బకాయిలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

రెండు ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలకు GST విభాగం గట్టి షాక్ ఇచ్చింది. భారీ మొత్తంలో ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. ICICI బ్యాంకును 26.8 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకును 62.3 లక్షలు కట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ఇరువురు రుణదాతలూ డిమాండ్ నోటీసులు అందుకున్నారు.

GST department tax notices to ICICI Bank and Kotak Mahindra Banks

24.37 కోట్ల పన్నులకుగాను 2.43 కోట్ల జరిమానా కలిపి మొత్తం 26.8 కోట్లు పే చేయాలని తమిళనాడు GST డిపార్ట్‌మెంట్ నోటీసులు అందించినట్లు ICICI బ్యాంకు తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇక ఒడిశాకు చెందిన GST మరియు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి తమకు షో కాజ్ కమ్ డిమాండ్ ఆర్డర్స్ వచ్చినట్లు కోటక్ మహీంద్రా బ్యాంకు స్పష్టం చేసింది. 5.1 లక్షల జరిమానాతో పాటు 57.20 లక్షల ట్యాక్స్ చెల్లించాలని అందులో పేర్కొన్నట్లు వెల్లడించింది.

కాగా ఇరు బ్యాంకులూ ఈ వ్యవహారంపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించాయి. తమ వాదనలకు మద్ధతుగా తగిన ఆధారాలు ఉన్నట్లు తెలిపాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో ICICI మరియు కోటక్ బ్యాంకుల షేర్ విలువ వరుసగా 0.75, 0.90 చొప్పున క్షీణించాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+