GST Meet: ఒకే దేశం - ఒకే ట్యాక్స్ నినాదంతో మోదీ ప్రభుత్వం వస్తు, సేవల పన్నును తీసుకొచ్చింది. ఆయా ఉత్పత్తులపై విధించిన ట్యాక్స్ ను దశలవారీగా రివైజ్ చేస్తూ వస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జూలై 11న GST కౌన్సిల్ 50వ సమావేశం జరగనుంది. అందులో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని వస్తువులపై పన్నుపోటు తగ్గనుందని భావిస్తున్నారు.
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఔషధం Dinutuximabకు పన్ను మినహాయింపు ఇస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం 12 శాతం ట్యాక్స్ విధిస్తోంది. 36 లక్షలు ఖరీదు చేసే దీనికోసం క్రౌడ్‌ఫండింగ్ ద్వారా రోగులు నిధులు సేకరిస్తున్నారు. తద్వారా వారికి కొంతమేర ఉపశమనం కలిగించాలని యోచనలో ఉన్నట్లు ఫిట్ మెంట్ కమిటీ పేర్కొంది.

సినిమా థియేటర్స్‌లో లభించే ఆహారం, శీతల పానీయాలపై కొన్ని మల్టీప్లెక్స్‌లలో 18 శాతం పన్ను విధిస్తున్నారు. దీనిని 5 శాతానికి తగ్గించాలని GST కౌన్సిల్ ను ఫిట్ మెంట్ కమిటీ కోరింది. 100 కంటే తక్కువ ధర కలిగిన సినిమా టిక్కెట్లపై 12 శాతం పన్ను విధిస్తుండగా, అంతకు మించిన వాటిపై 18 శాతం వసూలు చేస్తోంది. దీనిని కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
కొండ ప్రాంతానికి చెందిన 11 రాష్ట్రాల పరిశ్రమలు పూర్తి CGSTతో పాటు 50 శాతం IGST రీయింబర్స్ చేయాలని కోరుతున్నాయి. ఆన్ లైన్ గేమింగ్ మీద మంత్రివర్గ నివేదిక, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చర్చకు రానున్నాయి. SUV, MUV, XUV వాహనాల నిర్వచనాలు మరియు ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి ప్రైవేట్ సంస్థలపై విధిస్తున్న 18 శాతం పన్నులో మినహాయింపులు మొదలగు వాటిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications