న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం కారణంగా పన్ను వసూళ్లు లక్ష్యాలను చేరుకునే అవకాశాలు లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జీఎస్టీ వసూళ్లు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లుగా నిర్దేశించుకుంది. ఈ నాలుగు నెలల కాలానికి జీఎస్టీ రూపేణా మొత్తంగా రూ.4.55 లక్షల కోట్లు వసూళ్లను నిర్దేశించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన వాటా కింద రూ.6.63 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలు కావొచ్చని భావిస్తోంది.

ఇబ్బంది పెట్టకుండా.. వసూళ్లు
రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మంగళవారం ఈ విషయమై ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పన్ను ఎగవేతల్ని అరికట్టాలని, పన్ను చెల్లింపుదారుల్ని వేధింపులకు గురి చేయకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా జీఎస్టీ, ఆదాయపు పన్ను వసూళ్ల లక్ష్యాల్ని చేరుకోవాలని ఉన్నతాధికారులకు నిర్దేశించారు. 2019-20లో ప్రత్యక్ష పన్నుల ఆదాయం టార్గెట్ రూ.13.35 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక వృద్ధి మందగనం, కార్పోరేట్ పన్నుల కోత నేపథ్యంలో పన్ను వసూళ్లు తగ్గవచ్చుననే ఆందోళనలు ఉన్నందున వసూళ్ల వేగాన్ని ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.

జీఎస్టీ రేట్లు, సెస్ పెంచాలని సూచనలు
జీఎస్టీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రాష్ట్రాలకు పరిహారం ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పన్ను రేట్లపై సమీక్ష నిర్వహించేందుకు ఈ రోజు (డిసెంబర్ 18) జీఎస్టీ మండలి సమావేశమవుతోంది. పన్నుల ఆధాయం తగ్గడంతో పాటు లోటును భర్తీ చేయాలంటే జీఎస్టీ రేట్లు, సెస్ పెంచాలనే సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి.

పన్ను రెట్లు పెంచొద్దు..
అయితే మందగమనం నేపథ్యంలో పన్ను రేట్లు పెంచడం సరికాదని, అలాంటి నిర్ణయాన్ని తాము అంగీకరించమని కేంద్ర ఆర్థికమంత్రికి బెంగాల్ ఆర్థికమంత్రి లేఖ రాశారు. కొత్త పన్ను రేట్లు, సెస్ విధించే బదులు ఆదాయం పెంచుకునే మార్గాలు కనుగొనాలని బెంగాల్ ఆర్థికమంత్రి లేఖలో పేర్కొన్నారు.

గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ లక్ష్యం చేరకపోవచ్చు..
ఇదిలా ఉండగా, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ (GTR) రానున్న అయిదేళ్ల కాలంలో అంచనా కంటే తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి ఆర్థిక సంఘం తెలిపింది. ఉదాహరణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో GTR అంచనా రూ.25.52 లక్షల కోట్లు కాగా, 2018-19 అంచనాల ఆధారంగా రూ.23.61 లక్షల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. అంటే రూ.2 లక్షల కోట్ల వరకు తగ్గుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications