నేడు జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. నేటి సమావేశంలో ఎక్కువగా ఫోకస్ చేయనున్న రంగాల్లో బీమా రంగం కూడా ఉంది. దింతో ఈ సమావేశంలో లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీని తగ్గించవచ్చని భావిస్తున్నారు. అంతే కాకుండా లగ్జరీ ఉత్పత్తులపై జిఎస్టి పెంచవచ్చు. ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని కూడా జీఎస్టీ శ్లాబ్‌లోకి తీసుకురావడంపై చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే .
148 అంశాలపై కౌన్సిల్ చర్చ
నేటి సమావేశంలో మొత్తం 148 అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించనుంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, చిన్న పెట్రోల్, డీజిల్ వాహనాలపై జీఎస్టీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉండగా 18 శాతం పెంచాలనే చర్చ జరుగుతోంది.

మీరు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పై బిగ్ రిలీఫ్
నేటి GST కౌన్సిల్ సమావేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ పై GSTని తొలగించవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై కూడా GST తొలగింపు చేయవచ్చు. ఇది కాకుండా, రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా తీసుకునే వ్యక్తులకి కూడా GSTలో పెద్ద మినహాయింపు ఇవ్వవచ్చు. 20 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ వాటర్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించవచ్చు. అలాగే సైకిళ్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించవచ్చు.
ఏ రేట్లు పెంచవచ్చు?
నివేదికల ప్రకారం, లగ్జరీ ఉత్పత్తులపై GST రేట్లను పెంచవచ్చు. రూ.25,000 కంటే ఎక్కువ ధర ఉండే వాచీలపై జీఎస్టీ 18 శాతానికి బదులుగా 28 శాతం, రూ. 15,000 కంటే ఎక్కువ ధర ఉన్న షూలపై జీఎస్టీ 18 శాతానికి బదులుగా 28 శాతం, రూ.1500 వరకు రెడీమేడ్ దుస్తులపై జీఎస్టీ 5 శాతం వరకు ఉంటుంది. అలాగే రూ. 1500 నుండి రూ. 10,000 మధ్య ధర ఉన్న రెడీమేడ్ దుస్తులను 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి తీసుకురావచ్చు ఇంకా రూ. 10,000 కంటే ఎక్కువ ధర ఉన్న రెడీమేడ్ దుస్తులను 28 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి తీసుకురావచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications