GST Council Meeting : న్యూఢిల్లీలో బుధవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రెండు రోజుల పాటు ప్రారంభమైంది. 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన చర్చల్లో ఇదే అత్యంత ప్రభావవంతమైన మార్పులు తీసుకురాబోతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సారి కేంద్రం ప్రతిపాదించే మార్పులు విస్తృత స్థాయిలో ప్రభావం చూపేలా ఉండనున్నాయి.
ఒకవైపు సాధారణ వినియోగదారులకు రోజువారీ నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు చౌకగా మారవచ్చు. మరోవైపు లగ్జరీ కార్లు, హానికర వస్తువులపై అధిక పన్నులు విధించాల్సి రావచ్చు. అయితే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే రాష్ట్రాలు ఎంత మేరకు ఆదాయాన్ని కోల్పోతాయి? కేంద్రం ఆ నష్టాన్ని భర్తీ చేస్తుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.

జీఎస్టీ మొదటిసారిగా అమల్లోకి వచ్చినప్పుడు.. రాష్ట్రాలకు ఐదేళ్లపాటు ఆదాయ నష్టానికి పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. లగ్జరీ, హానికర వస్తువులపై సెస్ విధించడం ద్వారా ఆ నిధులు సమకూర్చుకునే వారు. అయితే ఆ పరిహార ఏర్పాటు 2022 జూన్‌లో ముగిసింది. ఇప్పుడు కొత్త పరిహార వ్యవస్థ లేకుండా పన్ను కోతలు అమలు చేస్తే రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేవని పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ వంటి ప్రతిపక్ష నేతృత్వంలోని రాష్ట్రాలు హెచ్చరిస్తున్నాయి.
ఆర్థిక నిపుణులు కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. బేకర్ టిల్లీ ASA ఇండియా LLP భాగస్వామి సందీప్ గుప్తా అభిప్రాయం ప్రకారం.. కర్ణాటక, తమిళనాడు వంటి వినియోగ రాష్ట్రాలు ఈ మార్పుల వల్ల లాభం పొందవచ్చు. అయితే అప్పుల భారం ఎక్కువగా ఉన్న పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయి. మహారాష్ట్ర కూడా పెద్ద లోటుతో ఇబ్బంది పడే అవకాశముంది. ఇక ఈ సంస్కరణ విజయవంతమవ్వాలంటే.. కేంద్రం అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాలను ఎంతవరకు సమన్వయం చేస్తుందన్నదే కీలకమని ఆయన అన్నారు.
మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాత్రం వేరే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆయన మాటల్లో ప్రధానమంత్రి మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సంస్కరణను దీపావళి బహుమతిగా ప్రకటించారు. అయితే ఇలాంటి ప్రకటన వినియోగదారులలో వాయిదా వేసుకునే భావనను కలిగిస్తుంది. ఉదాహరణకు కారు ధరలు 2-3 లక్షలు తగ్గుతాయని భావించే వారు వెంటనే కొనుగోలు చేయరు. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి ఇది ఊహించని ప్రతిచర్యగా అనిపించిందని.. అందుకే వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని చూస్తుందని అన్నారు.
ఆదాయ నష్టం విషయంలో గార్గ్ లెక్కలు మరింత కఠినతరంగా ఉన్నాయి. రాష్ట్రాలకు సరైన పరిహారం ఇవ్వకపోతే నష్టాలు రూ. 2 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉండకపోవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రధానమంత్రి దీనిని ప్రకటించినందువల్ల తక్కువ మొత్తాన్ని ఇవ్వడం అసాధ్యం.అయితే రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో సహాయం చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా కౌన్సిల్ సమావేశంలో తీవ్రమైన వాదోపవాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
PwC ఇండియా భాగస్వామి ప్రతీక్ జైన్ కూడా జీఎస్టీ కోతలు త్వరలోనే అమలు కావచ్చని అంచనా వేశారు. ఇది ఈ నెలలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 లేదా అంతకంటే ముందే నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే అమలు తీరే ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. ఆదాయ నష్టం రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని అయితే పన్ను బేస్ పెరుగుదలతో దీన్ని కొంతవరకు సర్దుబాటు చేయవచ్చని ఆయన సూచించారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications