కరోనా సంబంధ రిలీఫ్ ఉత్పత్తులపై దిగుమతి సుంకానికి సంబంధించి ఊరట కల్పించింది జీఎస్టీ కౌన్సిల్. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ నేడు భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అయితే, కరోనా మెడిసిన్స్, వ్యాక్సీన్స్, వైద్య పరిరకాలపై విధిస్తున్న పన్ను అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం నిర్మలమ్మ మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

ఈ భేటీలో ముఖ్యంగా కరోనా సంబంధిత వస్తువులపై పన్ను అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సీతారామన్ తెలిపారు. పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఉపసంఘం 10 రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. అయితే, విరాళంగా వచ్చిన వైద్య పరిరకాలకు సంబంధించి జీఎస్టీ మినహాయింపు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రభుత్వం లేదా ఏజెన్సీలకు వచ్చే వైద్య పరిరకాలపై మినహాయింపును ఈ ఏడాది ఆగస్ట్ 31 వరకు కొనసాగుతుందన్నారు. మినహాయింపు జాబితాలో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిస్-బి ఔషధాన్ని చేర్చామన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ పై బ్యాక్ డోర్ జీఎస్టీ విధించడాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అదే సమయంలో కొన్ని ప్రాణాధారమైన మెడిసిన్స్ పై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీఎస్టీ 12శాతం నుంచి 5శాతంకు కుదించడంపై కేంద్రం పునరాలోచన చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఇక ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కూడా 3శాతం నుంచి 5శాతంకు పెంచాలని కరోనావేళ రాష్ట్రప్రభుత్వాలు మరింత ఎక్కువగా రుణాలు పొందేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications