GST Council Meet: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పాల ఉత్పత్తుల నుండి ఆటోమొబైల్స్ వరకు జీఎస్టీ రేట్ల మీద కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడానికి వస్తువులు, సేవల పన్ను సవరణలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై నేడు సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి.
ఆగస్టు 15న ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ GST సంస్కరణలను ప్రకటించిన సంగతి విదితమే. ఆ ప్రసంగంలో దీపావళికి దేశ ప్రజలకు మంచి గిప్ట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ GST కౌన్సిల్ సమావేశంలో ఆ గిఫ్ట్ ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పాల ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, బీమా సేవలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు వంటి అనేక రంగాలపై వస్తువులు, సేవల పన్ను (GST) స్లాబ్‌లను తగ్గించే ప్రతిపాదనలపై లోతైన చర్చ జరుగుతోంది.

అన్ని ఆహార పదార్థాలపై ఏకరీతి 5% పన్ను విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటిపై వేర్వేరు రేట్లు విధించబడుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లపై కూడా GST తగ్గించవచ్చు. అదేవిధంగా, మద్యం మరియు లగ్జరీ వస్తువుల వంటి కొన్ని ప్రత్యేక వస్తువులకు 40% స్లాబ్‌ను సృష్టించవచ్చు.
ప్రస్తుతం 5, 12, 18 మరియు 28 శాతం పన్ను స్లాబ్‌లతో అమలవుతున్న నాలుగు-స్థాయిల నిర్మాణాన్ని క్రమంగా సులభతరం చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఈ సంస్కరణలలో భాగంగా.. 12 శాతం స్లాబ్‌లో ఉన్న దాదాపు 99 శాతం ఉత్పత్తులను 5 శాతం కేటగిరీకి మార్చే యోచనలో కేంద్రం ఉంది. అదే విధంగా.. 28 శాతం స్లాబ్‌లోని సుమారు 90 శాతం వస్తువులను 18 శాతం కేటగిరీలోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీని ప్రకారం.. భవిష్యత్తులో కేవలం 5 శాతం, 18 శాతం అనే రెండు ప్రధాన స్లాబ్‌లే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హానికరమైన వస్తువులపై ప్రత్యేకంగా 40 శాతం పన్ను విధించాలని ప్రతిపాదన కూడా ముందుకొచ్చింది. ఇందులో పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, సిగరెట్లు వంటి వస్తువులు ఉండే అవకాశం ఉంది. లగ్జరీ కార్లు, SUVలపై కూడా ఇదే ప్రత్యేక పన్ను విధించాలని చర్చ జరుగుతోంది.
కేంద్రం ప్రతిపాదన ప్రకారం.. నెయ్యి, గింజలు, 20 లీటర్ల తాగునీరు, నాన్-ఎరేటెడ్ పానీయాలు, నామ్‌కీన్, కొన్ని పాదరక్షలు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలు వంటి వస్తువులు ప్రస్తుత 12 శాతం స్లాబ్ నుండి 5 శాతం స్లాబ్‌లోకి వచ్చే అవకాశముంది. అదే విధంగా పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులు, హెయిర్ పిన్‌లు వంటి సాధారణ వస్తువులు కూడా 5 శాతం పన్ను కేటగిరీకి వచ్చే అవకాశం ఉంది.
ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం పన్నును 5 శాతం లేదా పూర్తిగా సున్నా శాతానికి తగ్గించే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది. ఇది సాధారణ వినియోగదారులకు గణనీయమైన ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. మరోవైపు.. టెలివిజన్లు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ప్రస్తుతం 28 శాతం ఉన్న పన్ను 18 శాతానికి తగ్గవచ్చు. ఆటోమొబైల్ రంగంలో కూడా మార్పులు ప్రతిపాదనలో ఉన్నాయి. ఎంట్రీ లెవల్ చిన్న కార్లపై 18 శాతం రేటు వర్తించవచ్చు, అయితే SUVలు, లగ్జరీ కార్లపై 40 శాతం పన్ను విధించే అవకాశముంది.
ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో గోమ్ (GoM) 18 శాతం పన్ను స్లాబ్‌ను సూచించినప్పటికీ, కేంద్రం మాత్రం EV వినియోగాన్ని ప్రోత్సహించడానికి 5 శాతం రేటుకు మద్దతు ఇస్తోంది. ఈ అంశంపై తుది నిర్ణయం సమావేశంలో వెలువడే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
జీఎస్టీ పన్ను తగ్గింపుతో ధరలు తగ్గుతాయని వినియోగదారులు ఆశిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం తమకు కలిగే ఆదాయ నష్టానికి కేంద్రం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన పరిహార విధానం జూన్ 2022తో ముగిసింది. ఇప్పుడు కొత్త పరిహార పథకం లేకుండా ఈ సంస్కరణలను అమలు చేయడం కష్టమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. జూలై 2017లో అమలులోకి వచ్చిన జీఎస్టీ, కేంద్రం, రాష్ట్రాల పన్నులను ఒకే పన్ను కింద విలీనం చేసింది.
అప్పటినుంచి ఇది ఒకే పన్ను - ఒకే దేశం సిద్ధాంతానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తే, పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. తద్వారా చిన్న వ్యాపారాలపై సమ్మతి భారాన్ని తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ జీఎస్టీ సమావేశానికి ముందు నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..రాబోయే నెలల్లో ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే, భారత ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందన్నారు. పన్ను వ్యవస్థ సులభతరం కావడం వల్ల చిన్న వ్యాపారాలకు వృద్ధి చెందడానికి మరింత అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications