కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల దిశగా కీలక చర్యలు చేపట్టింది. వస్తువులు, సేవల పన్ను (GST) అమలులోకి వచ్చి 8 సంవత్సరాలు అయిన సంధర్భంగా మరింత పారదర్శకంగా దానిని అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రభుత్వం 12% పన్ను స్లాబ్‌ను రద్దు చేయాలని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా ఉత్పత్తులను 12 శాతం నుంచి 5% పన్ను పరిధిలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీంతో నిత్యావరసర వస్తువులు మరింత చౌక ధరల్లోకి రానున్నాయి. ఇది సామాన్యులకు ఊరట కలిగిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం, పాల ఉత్పత్తులు, జున్ను, పాల పానీయాలు, స్వీట్లు, రూ. 1000 వరకు బూట్లు, కొన్ని బట్టలు, ఇటుకలు, క్లీన్ ఎనర్జీ పరికరాలు అలాగే కొన్ని చేపల ఉత్పత్తులు వంటి అనేక ముఖ్యమైన వస్తువులు 12% పన్ను శ్లాబ్‌లో చేర్చారు. అయితే వీటిని 5% శ్లాబ్‌లోకి తీసుకువస్తే వాటి ధరలు నేరుగా తగ్గడమే కాకుండా.. ఇది సామాన్యుల జేబులపై భారాన్ని తగ్గిస్తుందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభుత్వం GST పన్ను శ్లాబులను 5%, 18%, 28% అనే మూడు రేట్లకు తగ్గించాలని ఆలోచిస్తోంది. ఈ రకమైన నిర్ణయం ద్వారా వ్యాపారులతో పాటుగా కస్టమర్లు ఇద్దరూ అర్థం చేసుకోవడం సులభతరం చేస్తుంది.

ప్రస్తుతం కార్లు, సిగరెట్లు, పాన్ మసాలా, శీతల పానీయాల వంటి కొన్ని ఖరీదైన ఉత్పత్తులపై అదనపు పన్నుగా సెస్ విధించబడుతుంది. GST కారణంగా రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ సెస్ మొదట్లో విధించడం జరిగింది. కరోనా కాలంలో రాష్ట్రాలు పొందిన రుణాలను తిరిగి పొందడానికి ఈ సెస్‌ను మార్చి 2026 వరకు పొడిగించారు. కానీ ఇప్పుడు దానిని రద్దు చేసి GST రేటుకు జోడించే ప్రణాళిక కూడా కేంద్రం చేస్తోంది. సెస్‌ను తొలగించి GST రేటుకు జోడిస్తే.. ఇది పన్ను నిర్మాణంలో మరింత పారదర్శకతను సృష్టించడమే కాకుండా రాష్ట్రాలు కూడా పన్నులో అధిక వాటాను పొందే అవకాశం ఉంది.
ప్రస్తుతం ముఖ్యమైన మందులు పన్ను రహితంగా లేదా 5% పన్ను స్లాబ్ కిందకు వస్తాయి.అలాగే మరికొన్ని మందులకు 12% పన్ను విధిస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక నిపుణులు ఈ మందులను కూడా 5% స్లాబ్ కిందకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సామాన్యులకు చికిత్స ఖర్చు తగ్గి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.
జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశం జూలై మూడవ వారంలో లేదా వర్షాకాల సమావేశాల తర్వాత జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో, పన్ను స్లాబ్‌ల సమీక్ష, సెస్‌ల ఏకీకరణ, కొన్ని రంగాలలో పన్ను నియమాల సరళీకరణ వంటి ముఖ్యమైన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. దీనితో పాటు, జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, ఇన్‌వాయిస్ వ్యవస్థను సరళీకృతం చేయడం వంటి సాంకేతిక సంస్కరణలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ సంవత్సరం ఈ సెస్ దాదాపు రూ.1.67 లక్షల కోట్ల వసూలు చేసింది. అయితే ఈ ఈ వసూళ్లు మార్చి 2026 తర్వాత ముగియనున్నాయి. ప్రభుత్వం ప్రకారం.. సెస్‌ను GSTలో విలీనం చేయడం ద్వారా వినియోగదారులు ధరలో ఎటువంటి తేడా ఉండదు. ప్రస్తుతం SUVపై 28% GST + 22% సెస్ విధించినట్లుగా.. భవిష్యత్తులో ఈ పన్ను నేరుగా 50% GSTగా కనిపిస్తుంది. సెస్ అనేది కనిపించదు. క్లుప్తంగా చెప్పాలంటే.. కేంద్ర ప్రభుత్వం 12% పన్ను స్లాబ్‌ను పూర్తిగా తొలగించి దాని కిందకు వచ్చే చాలా వస్తువులను 5% స్లాబ్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇది GST నిర్మాణాన్ని మరింత సులభతరం చేస్తుందని భావిస్తోంది.
ప్రస్తుతం GST కింద పన్ను రెండు భాగాలుగా విభజించారు. ఒకటి CGST (కేంద్ర GST) రెండవది SGST (రాష్ట్ర GST). SGST పూర్తిగా రాష్ట్రాలకు ఇవ్వబడుతుంది, అయితే కేంద్రం కూడా CGSTలో కొంత భాగాన్ని రాష్ట్రాలతో పంచుకుంటుంది.ఇప్పుడు GSTలో సెస్ చేర్చితే రాష్ట్రాలు కూడా దానిలో వాటా పొందుతాయి.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన పన్ను ఆదాయంలో 41% రాష్ట్రాలతో పంచుకుంటుంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications